Viral Video: గజరాజును చూసి పిల్లిలా పారిపోయిన మృగరాజు

Viral Video: గజరాజును చూసి పిల్లిలా పారిపోయిన మృగరాజు

Phani CH

|

Updated on: Sep 28, 2022 | 9:41 AM

అడవికి రాజు సింహం.. ఒక్కసారి సింహం ఏదైనా జంతువును వేటాడాలని డిసైడ్‌ అయింది అంటే ఇక అంతే..అవతలి జంతువుకి ఆయువు మూడినట్లే.. అంతటి రారాజును పరుగులు పెట్టించిందో ఏనుగు..

అడవికి రాజు సింహం.. ఒక్కసారి సింహం ఏదైనా జంతువును వేటాడాలని డిసైడ్‌ అయింది అంటే ఇక అంతే..అవతలి జంతువుకి ఆయువు మూడినట్లే.. అంతటి రారాజును పరుగులు పెట్టించిందో ఏనుగు.. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తలలు పట్టుకునేలా చేస్తుంది. ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు పరువుతీసేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో చుట్టూ అంతా అటవీప్రాంతంలా ఉంది. ఒక చోట సింహం హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. కానీ, పాపం దానికి తెలియదు..దాని వెనకాల ఏం జరుగుతుందో.. ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ, సింహం పడుకున్న చోటుకి ఒక ఏనుగు వచ్చింది.. అది దూరం నుంచి ఆ సింహాన్ని చూసింది..వెంటనే ఆ ఏనుగు వేగం పెంచింది. స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ సింహంపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇలా తనవైపు వస్తున్న ఆ భారీ ఏనుగును చూసిన సింహం ఒక్క ఉదుటన లేచి పరుగులంకించుకుంది. బతుకు జీవుడా అనుకుంటూ ప్రాణభయంతో పరుగులు తీసింది. ఈ వీడియోని ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూస్తున్న వేలమంది నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజకీయంగా ఇతను పనికిరాడట !! NTR పై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ !!

Published on: Sep 28, 2022 09:41 AM