Elephant: వెళ్లొద్దురా నాన్నా.. వాళ్లసలే మనుషులు..! ఏనుగు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు..

|

Sep 11, 2022 | 9:21 AM

తల్లిదండ్రులు తమ పిల్లల క్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. మనుషులకే కాదు.. మూగజీవాల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ఒక్కోసారి అమ్మానాన్నల మాటలు పిల్లలు పెడచెవిన పెడుతుంటారు.


తల్లిదండ్రులు తమ పిల్లల క్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. మనుషులకే కాదు.. మూగజీవాల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ఒక్కోసారి అమ్మానాన్నల మాటలు పిల్లలు పెడచెవిన పెడుతుంటారు. అయినా పేరెంట్స్ పట్టు వదలరు. అది వారికి పిల్లల మీద ఉన్న లవ్‌ అండ్‌ కేరింగ్‌కు నిదర్శనం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. ఇందులో ఒక సఫారీ పార్కులో ఏనుగు, దాని పిల్ల రోడ్డు దాటుతున్నాయి. అదే సమయంలో కొందరు టూరిస్టులు ఆమార్గంలో వస్తారు. పిల్ల ఏనుగు వారిని చూస్తుంది. ఉత్సుకతతో పర్యాటకుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన తల్లి వెంటనే ‘ఎక్కడికి వెళ్తున్నావ్‌’ అన్నట్టుగా తొండంతో గున్న ఏనుగును తనవైపుకు లాక్కొని.. అటు వెళ్లొద్దంటూ బుజ్జగించి, దగ్గరకు రావొద్దన్నట్లు టూరిస్టులకు ఓ లుక్‌ ఇచ్చి పిల్లను వెంటపెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఈ అద్భుత వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. పాతదా? కొత్తదా? ఎక్కడ జరిగింది అనేది తెలియదు కానీ ఈ వీడియోను మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. లక్షల్లో లైక్‌ చేస్తూ ఆ ఏనుగు తల్లి ప్రేమకు ముచ్చటపడిపోతున్నారు. పేరెంటింగ్ అంటే ఇదేనంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Follow us on