అడవిలో వెళ్తున్న బస్సు డ్రైవర్ కు వింత అనుభవం.. ఆపి లిఫ్ట్ అడిగిన ఏనుగు
ఇటీవల సోషల్ మీడియాలో అటవీప్రాంతాల్లోని జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఇటీవల సోషల్ మీడియాలో అటవీప్రాంతాల్లోని జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇందులో ఓ ఫారెస్ట్ ఏరియాలో ప్రయాణికులతో ఉన్న బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సుకు ఓ ఏనుగు ఎదురైంది. రోడ్డుకు అడ్డంగా వస్తున్న ఏనుగును చూసి డ్రైవర్ కాస్త భయపడి బస్సును స్లో చేశాడు. బస్సును వెనక్కు తిప్పేందుకు ప్రయత్నించాడు. అయితే ఏనుగు ఆగు..ఆగు.. నేనూ వస్తా అన్నట్టుగా బస్సు దగ్గరకు వెళ్లింది. తన తొండంతో బస్సు డోరును ఓపెన్ చెయ్యడానికి ట్రైచేసింది. ఈ దృశ్యం చూడ్డానికి ఏనుగు బస్సు డ్రైవర్‌ను లిఫ్ట్ అడుగుతున్నట్టుగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను దాదాపు లక్షమంది వీక్షించగా వేలల్లో లైక్ చేస్తూ రీ ట్వీట్ చేశారు. అంతేకాదు వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విదేశీ అమ్మాయి కోసం యువకుడి తిప్పలు.. ఏంచేశాడో చూడండి !!
వామ్మో.. సిగరెట్‌తో తారాజువ్వలు వెలిగిస్తున్న వృద్ధుడు !!
Puri Jagannadh: తీవ్రమవుతున్న వివాదం.. పూరీ ఇంటి చుట్టూ పోలీసులు
‘ఆయన్ను వదిలేయండి పాపం’ సింగిల్ మాటతో షాకిచ్చిన మోనార్క్
‘విజయ్‌కు ఆమెతో పెళ్లైంది’ షాకింగ్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్