సుప్రీంకోర్టులో లాయర్‌గా తెలుగు హీరోయిన్‌..

సుప్రీంకోర్టులో లాయర్‌గా తెలుగు హీరోయిన్‌..

Phani CH

|

Updated on: Sep 04, 2023 | 9:10 PM

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అదృష్టం పరీక్షించుకోవడానికి ఏటా ఎందరో నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరు ఒకటి రెండు సినిమాలతోనే కనుమరుగైపోతారు. అలాంటి ఓ తెలుగు హీరోయిన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి అనతి కాలంలోనే భారీ ఆఫర్లు దక్కించుకున్న బ్యూటీ రేష్మా రాథోడ్. తొలినాళ్లలో వరుస అవకాశాలు తలుపు తట్టినా..ఆ తర్వాత ఎందుకో అంతగా కలిసి రాలేదు.

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అదృష్టం పరీక్షించుకోవడానికి ఏటా ఎందరో నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరు ఒకటి రెండు సినిమాలతోనే కనుమరుగైపోతారు. అలాంటి ఓ తెలుగు హీరోయిన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి అనతి కాలంలోనే భారీ ఆఫర్లు దక్కించుకున్న బ్యూటీ రేష్మా రాథోడ్. తొలినాళ్లలో వరుస అవకాశాలు తలుపు తట్టినా..ఆ తర్వాత ఎందుకో అంతగా కలిసి రాలేదు. వెంకటేశ్, త్రిష జంటగా నటించిన బాడీగార్డ్ మువీతో కెరీర్ స్టార్ట్ చేసారు రేష్మా. అదే ఏడాది ఈ రోజుల్లో.. సినిమాతో హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో రేష్మాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించారు. ఇవేవీ పెద్దగా సక్సెస్‌ కాలేదు. దాంతో 2017 తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ పార్టీలో చేరి అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో లా పూర్తి చేశారు. అంతేకాదు ఈ మధ్యనే సుప్రీంకోర్టు లాయర్‌గా ఎంపికయ్యారు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగి, చివరికి లాయర్‌గా స్థిరపడ్డారు హీరోయిన్‌ రేష్మా రాథోడ్. లాయర్‌గా రేష్మా రాథోడ్ ను చూసిన అభిమానులు అస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు. ఎంతగా మారిపోయారు.. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్యాంకుపై దొంగ ప్రశంసలు.. ఎందుకంటే ??

గుడ్‌న్యూస్ !! రూ.99 వేలకే ఎలక్ట్రిక్ కారు

ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా ?? అయితే లైట్ తీస్కోండి

రాజస్థాన్‌లో అమానవీయ ఘటన.. యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త,

3 పెళ్ళిళ్ళు.. మరో ముగ్గురితో సంబంధాలు.. కాలనీవాసులు ఏం చేశారో తెలుసా ??