Earth Hour 2024: ఓ గంట లైట్లు ఆపేస్తే ఏమవుతుంది.? మార్చి 23న ఎర్త్ అవర్ లో పాల్గొనండి.

|

Mar 21, 2024 | 10:36 AM

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు సంవత్సరానికి ఒక రోజున ‘ఎర్త్ అవర్’ పాటిస్తున్నారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు దీనిని జరుపుకుంటున్నారు. ఈసారి మార్చి 23న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంటపాటు నిర్వహిస్తున్నారు. ఆ రోజున అందరూ గంటపాటు అవసరం లేని లైట్లను ఆపివేయాల్సి ఉంటుంది. ఎర్త్ అవర్ అనగానే గంటపాటు లైట్లు ఆపేస్తే బోల్డంత విద్యుత్తు ఆదా అవుతుందన్నది మనకు కనిపించే అంశం మాత్రమే.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు సంవత్సరానికి ఒక రోజున ‘ఎర్త్ అవర్’ పాటిస్తున్నారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు దీనిని జరుపుకుంటున్నారు. ఈసారి మార్చి 23న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంటపాటు నిర్వహిస్తున్నారు. ఆ రోజున అందరూ గంటపాటు అవసరం లేని లైట్లను ఆపివేయాల్సి ఉంటుంది. ఎర్త్ అవర్ అనగానే గంటపాటు లైట్లు ఆపేస్తే బోల్డంత విద్యుత్తు ఆదా అవుతుందన్నది మనకు కనిపించే అంశం మాత్రమే. కానీ, దీని ద్వారా ప్రపంచానికి ప్రభావవంతమైన సందేశం వెళ్తుంది. పర్యావరణంపై మనకున్న శ్రద్ధను ఇది బయటపెడుతుంది. భవిష్యత్ తరాల కోసం ఈ భూమిని రక్షించాలన్న నిబద్ధతను ఇతరులతో పంచుకునేందుకు, సంఘీభావం ప్రదర్శించేందుకు మంచి అవకాశంగా నిలుస్తుంది. ఎర్త్ అవర్‌లో పాల్గొనేందుకు కష్టపడాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా 23న రాత్రి 8.30 నుంచి గంటపాటు అంటే 9.30 వరకు అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాలను కట్టేయడమే. తద్వారా ఆ సమయాన్ని అద్భుతంగా వినియోగించుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఆ గంటలో.. నక్షత్రాలను ఎంచక్కా వీక్షించవచ్చు.

క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చు. బయటకు వెళ్లి అలా ప్రకృతిని వీక్షిస్తూ ఆరుబయట తిరిగి రావొచ్చు. సో.. మర్చిపోకండేం.. మీ క్యాలెండర్‌లో, సెల్‌ఫోన్‌లో, ఇంకా మీకు గుర్తొచ్చేలా మార్చి 23ను మార్క్ చేసుకోండి. భూతాపం పెరిగిపోకుండా మీరు కూడా ఓ చేయి వేయండి. భవిష్యత్ తరాల కోసం భూమిని పరిరక్షించండి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో ఎర్త్ అవర్ పురుడుపోసుకుంది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ దీనిని ప్రారంభించింది. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక గంటపాటు లైట్లు ఆపివేయాలని పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దీనిని కొనసాగిస్తున్నారు. తొలి పిలుపుకే అనూహ్య స్పందన లభించింది. లక్షలాదిమంది ప్రజలు ఇందులో భాగస్వామ్యమయ్యారు. ప్రస్తుతం ఇందులో 190 దేశాలు భాగస్వామ్యమయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on