AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-Cigarette: పబ్ లో ఎంజాయ్ చేస్తుండగా జేబులో పేలిన ఈ సిగరెట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

E-Cigarette: పబ్ లో ఎంజాయ్ చేస్తుండగా జేబులో పేలిన ఈ సిగరెట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka
|

Updated on: Sep 04, 2022 | 8:38 AM

Share

'ధూమపానం ఆరోగ్యానికి హానికరం' ఈ కొటేషన్ మనం చాలా చోట్ల చూస్తాం. సినిమా థియేటర్లలో, పెద్ద పెద్ద మాల్స్‌లో బోర్డులు పెడతారు..అంతేకాదు సిగరెట్‌ ప్యాకెట్లపైన కూడా


‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ ఈ కొటేషన్ మనం చాలా చోట్ల చూస్తాం. సినిమా థియేటర్లలో, పెద్ద పెద్ద మాల్స్‌లో బోర్డులు పెడతారు..అంతేకాదు సిగరెట్‌ ప్యాకెట్లపైన కూడా సిగరెట్‌ ఆరోగ్యానికి హానికరం అని ముద్రిస్తారు. ఈ హెచ్చరికలను కేవలం కొటేషన్లుగా మాత్రమే తీసుకుంటారు ధూమపాన ప్రియులు. వాటిని ఏమాత్రం పట్టించుకోరు. ఆనక అనారోగ్యం బారిన పడిన పడతారు. కొందరు సాధారణ సిగరెట్లకు బ‌దులుగా హానికరం కాదని భావించి ఇ-సిగరెట్లు, వేప్‌లకు అల‌వాటుప‌డ‌తారు. అయితే, ఇ-సిగరెట్‌లు లేదా వేప్‌లు కూడా హానికరమేనిని ప‌లు అధ్యయ‌నాల్లో తేలింది. ఇ-సిగరెట్లు, వేవ్‌లు ఇతర మార్గాల్లో కూడా హాని కలిగిస్తాయని మీకు తెలుసా? అదెలా అంటే..

స్కాట్లాండ్‌లోని ఒక బిజీ పబ్‌కు అయిర్‌షైర్‌కు చెందిన ఓ వ్యక్తి వేప్‌ను జేబులో పెట్టుకుని పబ్‌కి వెళ్లాడు. అత‌డు ప‌బ్‌లో ఎంజాయ్ చేస్తుండ‌గా జేబులో ఉన్న వేప్‌ ఒక్కసారిగా పేలింది.
దాంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడి సిబ్బంది ఆ యువ‌కుడిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు . అతడి గాయాలకు చికిత్స చేసేందుకు వైద్యులు ప‌క్క తొడ నుంచి చర్మాన్ని స్కిన్ గ్రాఫ్ట్‌గా ఉపయోగించాల్సి వచ్చింది. అతని మధ్య వేలు తప్ప మిగ‌తా వేళ్లు, అరచేతిలో బొబ్బలు వ‌చ్చాయి. అనంతరం అతడిని ఆ హాస్పిటల్ నుంచి గ్లాస్గో రాయల్ ఇన్‌ఫర్మరీలోని స్పెషలిస్ట్ బర్న్ యూనిట్‌కి మార్చారు. ఆ గాయాలు చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. వేప్ పేల‌డం ద్వారా ఇంతగా గాయపడిని వారిని తామింతవరకూ చూడలేదన్నారు. బ్యాటరీ పేలడం వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని గాయపడిన వ్యక్తి తెలిపాడు. పేలిన‌ వేవ్‌ను సెప్టెంబర్ 2020లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన‌ట్టు చెప్పాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

 

Published on: Sep 04, 2022 08:38 AM
Follow Us