దువ్వాడ, దివ్వెల వారి సమర్పణలో.. వాలెంటైన్స్‌ డ్యూయెట్‌.. చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా

Updated on: Feb 15, 2025 | 6:31 PM

తెలుగు రాష్ట్రాల్లో.. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి పేర్లు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాగని, వారు ఆరేడుసార్లు ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిచిన లీడర్లేం కాదు. కుటుంబ వివాదం, ప్రేమ వ్యవహారంతో... ఇప్పుడు మోస్ట్‌ పాపులర్‌ పొలిటికల్‌ లవర్స్‌గా మారిపోయారు. ఏపీలో ప్రభుత్వం మారిన మరుక్షణం నుంచి... ఆ జంట పేరు మీడియాలో, సోషల్‌ మీడియాలో మార్మోగుతూనే ఉంది.

దీంతో, ఈ లేటు వయసు ఘాటు లవర్స్‌ తాజా వీడియో ఒకటి సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. వాలంటైన్స్ డే సందర్భంగా MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల డ్యూయెట్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ అయిన కేరళలోని వయనాడ్ లో చిత్రీకరించిన ఈ వీడియోలో దువ్వాడ, దివ్వెల జంట కొత్తగా కనిపించారు. వయనాడ్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ స్లో మోషన్ లో ఈ జంట వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. సూట్ వేసుకొని దువ్వాడ శ్రీనివాస్ కొత్త పెళ్ళికొడుకు మాదిరిగా న్యూ లుక్ లో కనిపించారు. ఈ వీడియో కొత్తగా తీసింది కాదని తెలుస్తోంది. కొన్ని నెలల కిందట దువ్వాడ, మాధురి జంట వయనాడ్ వెళ్ళింది. ఆ సందర్భంలో తీసిందే ఈ వీడియో. ఇన్నాళ్లు దీనిని బయటపెట్టలేదు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ వీడియో ను బయట పెట్టింది ఈ జంట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Brahma Anandam: బ్రహ్మానందం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్టా ?? ఫట్టా ??

విశ్వక్‌సేన్‌ లైలా సినిమా హిట్టా? ఫట్టా? తెలియాలంటే ఈ వీడియో చూసేయండి

పసి పిల్లాడని కూడా చూడకుండా ఆటలా.. బుల్లి రాజు చేసిన తప్పేంటి ??

MS నారాయణను చివరి క్షణంలో.. అలా చూసి కన్నీళ్లు ఆగలేదు

సాయి పల్లవితో కలిసి.. డ్యాన్స్ అదరగొట్టిన అల్లు అరవింద్