Viral: 89 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌నెస్ ఎలా బామ్మ..! పంచాయితీ ప్రెసిడెంట్‌గా విధులు…
89 సంవత్సరాల వయసులో ఎవరి పని వారికి చేసుకోవడమే కష్టమవుతుంది. కానీ ఓ వృద్ధురాలు పంచాయితీ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్న ఆమె ఫిట్‌నెస్ సీక్రెట్‌ను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఎందరికో స్పూర్తిగా నిలుస్తోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.
89 సంవత్సరాల వయసులో ఎవరి పని వారికి చేసుకోవడమే కష్టమవుతుంది. కానీ ఓ వృద్ధురాలు పంచాయితీ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్న ఆమె ఫిట్‌నెస్ సీక్రెట్‌ను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఎందరికో స్పూర్తిగా నిలుస్తోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. స్ఫూర్తివంతమైన కథనాలు పంచుకుంటారు. తాజాగా తమిళనాడులోని మధురైకి చెందిన 89 సంవత్సరాల పంచాయతీ ప్రెసిడెంట్ వీరమ్మాళ్ జీవితం గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవలే సుప్రియా సాహు అరిట్టపట్టి పంచాయతీ ప్రెసిడెంట్ వీరమ్మాళ్‌ను కలిశారు. ఆమె ఎంతో ఆరోగ్యంగా, యాక్టివ్‌గా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంగా కనిపించిన వీరమ్మాళ్‌ను ఈ వయసులో ఇంత యాక్టివ్‌గా ఉండటం వెనుక రహస్యం ఏంటని సుప్రియా అడిగారు. అందుకు ఆమె సంప్రదాయమైన ఇంటి భోజనం తినడం, రోజంతా పొలంలో కష్టపడి పనిచేయడమేనని చెప్పారు. వీరమ్మాళ్‌ను టీ, కాఫీలు తాగుతారా? అని అడిగారు సుప్రియ. చక్కెర వేసుకుని మరీ తాగుతానని చెప్పారు వీరమ్మాళ్. 89 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా ఉండటం.. చలాకీగా పనిచేయడం.. పంచాయతీ ప్రెసిడెంట్‌గా గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. వీరమ్మాళ్‌ను కలిసిన తరువాత సుప్రియా సాహు ఆమెతో మాట్లాడిన వీడియో, ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..