నేను ప్లే చేస్తా.. మీరు పే చెయ్యండి.. కళాకారుడి తెలివికి నెటిజన్ల ప్రశంసలు

|

Oct 02, 2023 | 8:00 PM

మనదేశంలో పెళ్లిళ్లు, జాతరలు, దేవుడి ఊరేగింపుల సమయంలో సన్నాయి, డప్పు వాయిద్యాలను ప్రధానంగా వాడుతూ వుంటారు. ఎందుకంటే అవి మన సంప్రదాయాలలో ఒక భాగం కనుక. ఇక పెళ్లి ఊరేగింపులో డోలు సన్నాయి రాగయుక్తంగా వాయిస్తుంటే ఆహుతులతో పాటు. వధూవరులు తన్మయత్వంలో డ్యాన్స్ చేయడం మనం చూస్తూ వుంటాం. అదే సమయంలో డోలు, సన్నాయి, డ్రమ్స్ వాయించే వాయిద్య కళాకారుల ప్రతిభను మెచ్చి కొందరు డబ్బులు గిఫ్ట్ గా ఇవ్వడం మనం చూస్తుంటాం.

మనదేశంలో పెళ్లిళ్లు, జాతరలు, దేవుడి ఊరేగింపుల సమయంలో సన్నాయి, డప్పు వాయిద్యాలను ప్రధానంగా వాడుతూ వుంటారు. ఎందుకంటే అవి మన సంప్రదాయాలలో ఒక భాగం కనుక. ఇక పెళ్లి ఊరేగింపులో డోలు సన్నాయి రాగయుక్తంగా వాయిస్తుంటే ఆహుతులతో పాటు. వధూవరులు తన్మయత్వంలో డ్యాన్స్ చేయడం మనం చూస్తూ వుంటాం. అదే సమయంలో డోలు, సన్నాయి, డ్రమ్స్ వాయించే వాయిద్య కళాకారుల ప్రతిభను మెచ్చి కొందరు డబ్బులు గిఫ్ట్ గా ఇవ్వడం మనం చూస్తుంటాం. ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. ఇంతకు ముందు ఎక్కడికి వెళ్లిన ఫర్స్‌ చేతితో పట్టుకెళ్లేవారు ఇప్పుడు ఫోన్‌ వెంటతీసుకెళ్తున్నారు. ఎందుకంటే అన్నీ డిజిటల్‌ పేమెంట్సే. దాంతో ఎవరి చేతిలో డబ్బులు ఉండటంలేదు. ఈ కారణంగా అందరూ డిజిటల్‌ యుగానికి తగ్గట్టుగా అప్‌డేట్‌ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ డోలు వాయిద్య కళాకారుడు ఆహుతులనుంచి కానుకలు స్వీకరించేందుకు ముందుచూపుతో ఓ క్యూ ఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ డ్రమ్మర్ తన డ్రమ్ మీద తన మొబైల్‌లో క్యూఆర్‌ కోడ్ నిఓపెన్ చేసుకుని పెట్టుకున్నాడు. ఎవరైనా వేడుక సందర్భంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే డ్రమ్‌పై అమర్చిన ఉన్న క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి అతనికి డబ్బులు ఇవ్వచ్చన్నమాట.ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ xలో షేర్ చేయగా ఈ ఫోటో పలువురిని ఆకట్టుకుంది. ఆ కళాకారుడు తెలివిని వినియోగదారులు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూట్యూబర్స్‌కి హెచ్చరిక.. వ్యూస్‌ కోసం అలాచేస్తే అంతే

మొసలిని కుక్కలా పెంచుతున్న వ్యక్తి !! నోట్లో చేయిపెట్టినా కొరకదట

TSRTC: టీఎస్‌ఆర్టీసీ బ‌స్సుల్లో తప్పనున్న చిల్లర తిప్పలు

తప్పిపోయిన బిడ్డ కనిపించగానే చెంపపై ఒక్కటిచ్చి.. నోటితో ఎత్తుకెళ్లిన పిల్లి

భర్తలు బీకేర్‌ ఫుల్ !! భార్యల బర్త్‌ డే మర్చిపోతే జైలుకే !!