Chennai: లాడ్జీలో అనుమానాస్పదంగా గిఫ్ట్ బాక్స్‌లు.. పోలీసులు వెళ్లి చెక్ చేయగా..!
డ్రగ్స్ రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేయడం ఇప్పుడు ప్రభుత్వాలకు, పోలీసులకు పెద్ద టాస్క్‌గా మారింది. రోజుకో కొత్త మార్గంలో మత్తు మందును సరఫరా చేస్తున్నారు కేటుగాళ్లు. ఇందుకోసం అనువైన అన్ని మార్గాలను యూజ్ చేసుకుంటున్నారు.
డ్రగ్స్ రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేయడం ఇప్పుడు ప్రభుత్వాలకు, పోలీసులకు పెద్ద టాస్క్‌గా మారింది. రోజుకో కొత్త మార్గంలో మత్తు మందును సరఫరా చేస్తున్నారు కేటుగాళ్లు. ఇందుకోసం అనువైన అన్ని మార్గాలను యూజ్ చేసుకుంటున్నారు. జైల్లో వేసి తాట తీస్తున్నా.. డ్రగ్ పెడ్లర్స్ తగ్గేదే లే అంటున్నారు. తాజాగా చెన్నైలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఫ్యాన్సీ గిఫ్ట్ బాక్సులు, రాడ్లలో డ్రగ్స్ తరలిస్తూ కిలోల లెక్కన అమ్ముతున్నారు. మెరీనా బీచ్, చెపాక్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా అవుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఓ లాడ్జీలో తనిఖీలు నిర్వహించడంతో ఈ దందా బయటపడింది. తనిఖీల్లో భారీగా డ్రగ్స్ గుర్తించారు. నాలుగున్నర కిలోల మెథాంఫేటమిన్, యాంఫేటమిన్ అనే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ దందాకు సంబంధించి ఆరుగరిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి శ్రీలంక మీదుగా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ బట్వాడా జరుగుతున్నట్టు నిర్ధారించారు. అరెస్టు చేసిన వ్యక్తులు గత రెండేళ్లుగా దేశం నుంచి డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

