తప్పిపోయిన బాలికను పట్టించిన డ్రోన్‌ కెమెరా వీడియో

Updated on: Apr 04, 2025 | 8:47 PM

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ముందువరుసలో నిలుస్తున్నారు. భీమవరంలో తప్పిపోయిన ఓ ఏడేళ్ల బాలికను డ్రోన్‌ కెమరాను ఉపయోగించి గంట వ్యవధిలోనే పట్టుకున్నారు. చిన్నగొల్లపాలెంకు చెందిన బొర్రా నాయనమ్మ అనే వృద్ధురాలు తన మనవడు, మనవరాలని తీసుకుని ఆధార్‌ కార్డు అప్డేట్‌ చేయించుకోవడానికి భీమవరం హెడ్‌ పోస్టాఫీసు వద్దకు వెళ్లింది.

అయితే పిల్లలను పక్కన కూర్చోపెట్టి తాను వాటర్‌ బాటిల్‌ కోసం వెళ్లి తిరిగి వచ్చేసరికి మనవరాలు దివ్య కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిపోయిన వృద్ధురాలు చుట్టుపక్కల వెతికినా పాప ఆచూకి లభించలేదు. దీంతో భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వన్‌టౌన్‌ సీఐ నాగరాజు వెంటనే స్పందించి బృందాలుగా ఏర్పడి డ్రోన్‌ సహాయంతో వెతకడం ప్రారంభించారు. మావూళ్లమ్మ అమ్మవారి ఆలయం వీధిలో ఏడుస్తూ రోడ్డు పక్కన ఉన్న పాపను గుర్తించారు. వెంటనే బాలికను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి నాయనమ్మకు అప్పగించారు.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌ జైలులో భారత మత్స్యకారుడు ఆ*త్మ*హత్య వీడియో

అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో

ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్‌ హత్య బెదిరింపులపై సల్మాన్‌ వీడియో

చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో