DR Congo: పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!

|

Sep 06, 2024 | 6:57 PM

డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలోని సెంట్రల్‌ మకాల జైలు గేట్లను బద్ధలుకొట్టే ప్రయత్నం జరిగింది. ఖైదీలంతా జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా సుమారు 129 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంటీరియర్‌ మంత్రి షబాని లుకో మంగళవారం ఎక్స్‌లో తెలిపారు. వీరిలో 24 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలోని సెంట్రల్‌ మకాల జైలు గేట్లను బద్ధలుకొట్టే ప్రయత్నం జరిగింది. ఖైదీలంతా జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా సుమారు 129 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంటీరియర్‌ మంత్రి షబాని లుకో మంగళవారం ఎక్స్‌లో తెలిపారు. వీరిలో 24 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మకాల జైలు నుంచి తప్పించుకొనేందుకు ఖైదీలు సామూహికంగా ప్రయత్నించారనీ ఈ క్రమంలో గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగడంతో తొక్కిసలాట జరిగిందని, అదే సమయంలో కిచెన్‌లో చెలరేగిన మంటల్లో మొత్తం 129 మంది మరణించారనీ మంత్రి షబాని లుకో తెలిపారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారనీ ఈ ఘటనలో అడ్మినిస్ట్రేటివ్‌ భవనం కూడా దెబ్బతింది అన్నారు. అయితే ఖైదీలు ఎవరూ తప్పించుకొని వెళ్లలేదని, తప్పించుకొనేందుకు ప్రయత్నించినవారు మాత్రం మరణించారని జైలు అధికారులు వ్యాఖ్యానించారు. ఇక లోపలున్న ఖైదీల వాదన మాత్రం మరోలా ఉంది. తమకు బయట నుంచి భారీ కాల్పుల చప్పుళ్లు వినిపించాయనట్టు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.