శునకాలకూ పగా ప్రతీకారాలు ఉంటాయా?ఈ వీడియో చూస్తే షాకవుతారు
సాధారణంగా శునకాలు అన్నం పెట్టిన యజమాని పట్ల విశ్వాసం చూపిస్తాయి. కనిపించినప్పుడల్లా తోక ఆడిస్తూ ఆనందిస్తాయి. అయితే కోపం వస్తే అవే శునకాలు ప్రతీకారంతో కూడా రగిలిపోతాయని తాజాగా జరిగిన ఓ ఘటన స్పష్టం చేస్తోంది. తనను ఢీకొట్టిన కారు యజమాని పై ఓ కుక్క ప్రతీకారం తీర్చుకుంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. తిరుపతిపురం కాలనీలో ప్రహ్లాద్ సింగ్ ఘోషీ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన తన కుటుంబంతో కలిసి కారులో బంధువుల వివాహానికి బయలుదేరాడు.
ఆయన ఇంటికి 500 మీటర్ల దూరంలో రోడ్డు పక్కన పడుకున్న కుక్కకు కారు తగిలింది. అయితే ఈ ఘటనలో కుక్కకు ఎలాంటి గాయాలు కాలేదు. అయినా కారు తనకు తగలడంతో ఆ శునకానికి కోపం వచ్చింది. కారు తనకు కనపడకుండా పోయేవరకు గట్టిగా అరుస్తూ వెంబడించింది. ఘోషి కుటుంబం వివాహానికి హాజరై అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరుకుంది. వారు కారును ఇంటి ముందు పార్కు చేసి లోపలికి వెళ్లారు. ఉదయం లేచి తన కారును చూసుకున్న ఘోషి బిత్తరపోయారు. ఎందుకంటే ఆ కారుపై అన్నీ గీతలే ఉన్నాయి.
వైరల్ వీడియోలు

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
