Dog Train Journey: నా రైలు ప్రయాణం విశేషాలు.. కుక్క వీడియో వైరల్..! కుక్కకో స్పెషల్ టికెట్..
ఇటీవల తన పెంపుడు కుక్క కోసం ఓ వ్యక్తి ఏకంగా విమానంలోని బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసిన వార్త విన్నాం కదా. అలాగే.. మరో వ్యక్తి ఇటీవల తన పెంపుడు కుక్క రియోను ముంబై నుంచి భువనేశ్వర్ వరకు రైల్లో తీసుకెళ్లాడు.
ఇటీవల తన పెంపుడు కుక్క కోసం ఓ వ్యక్తి ఏకంగా విమానంలోని బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసిన వార్త విన్నాం కదా. అలాగే.. మరో వ్యక్తి ఇటీవల తన పెంపుడు కుక్క రియోను ముంబై నుంచి భువనేశ్వర్ వరకు రైల్లో తీసుకెళ్లాడు. అంతే కాదు. దాని ట్రెయిన్ జర్నీకి సంబంధించిన వీడియోను రియో కంటూ ప్రత్యేకించి ఓపెన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ముంబై నుంచి భువనేశ్వర్‌కు నా ప్రయాణ విశేషాలు అంటూ కాప్షన్ కూడా పెట్టడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మనం పెంచుకునే కుక్కలు, పిల్లులు.. ఎటైనా వెళ్తున్నప్పుడు మనతో పాటు వాటిని కూడా తీసుకెళ్లాలని అనుకుంటాం. అసలు జంతువులను రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారా? బస్సుల్లో పెట్ ఎనిమల్స్‌ను అనుమతించరు.కానీ రైళ్ళలో పెట్ డాగ్స్‌కు అనుమతి ఉంది. కాకపోతే వాటిని కేవలం ఫస్ట్ క్లాస్ ఏసీలో మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ మొత్తం డాగ్ ఓనర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న కుక్క పిల్లలు అయితే వాటి కోసం కొన్ని కంపార్ట్‌మెంట్లలో బాక్స్‌లు ఉంటాయి. ఫుడ్ కూడా డాగ్స్ ఓనర్సే తెచ్చుకోవాలి.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)