అమ్మ ప్రేమకు దూరమైన పులి కూనలను చేరదీసిన శునకం..!
ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఏదీ లేదు. ప్రతి క్షణం పిల్లల కోసమే తపించే అమ్మ కంటే ఎవరూ ఎక్కువ కాదు. పిల్లలకు చిన్న కష్టం వస్తేనే తల్లి తల్లడిల్లిపోతుంది.
ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఏదీ లేదు. ప్రతి క్షణం పిల్లల కోసమే తపించే అమ్మ కంటే ఎవరూ ఎక్కువ కాదు. పిల్లలకు చిన్న కష్టం వస్తేనే తల్లి తల్లడిల్లిపోతుంది. అలాంటిది ఆ పిల్లలను తల్లి దూరం చేసింది. అయితేనేం.. అమ్మ ప్రేమకు దూరమైన పసికూనలను జాతి వైరం పక్కనబెట్టి.. శూనకం చేరదీసింది. తాజాగా ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియో అమితంగా ఆకట్టుకుంటోంది. అమ్మ ప్రేమకు దూరమైన మూడు పులి పిల్లలను అక్కున చేర్చుకుంది ఓ లాబ్రాడర్ డాగ్. అలాగని ఆ అమ్మ వాటికేం శాశ్వతంగా దూరం కాలేదు. ఓ తల్లి పులి దానికి పుట్టిన మూడు పిల్లలను పుట్టినప్పటి నుంచి దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో జూ నిర్వాహకులు.. ఆ పులి కూనల ఆలనా పాలనను ఓ శునకానికి అప్పజెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం! నవ వధువుకు ఘోర అవమానం !! అత్తగారింట్లోకి అడుగు పెట్టకముందే ??
ఈ బామ్మ ఎనర్జీ వేరే లెవల్.. 80 ఏళ్ల వయసులో స్కిప్పింగ్
పైతాన్‌తో పోజులిచ్చాడు.. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్.!