నీళ్లలో పడ్డ బిడ్డ కోసం ఓ కుక్క సాహసం.. నెట్టింట వీడియో వైరల్
మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా అమ్మతనానికి మించిది లేదంటారు. బిడ్డ కష్టాల్లో ఉంటే.. అమ్మ ఎంతటి సాహసమైనా చేస్తుంది. ప్రాణాలకు సైతం తెగిస్తుంది.
మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా అమ్మతనానికి మించిది లేదంటారు. బిడ్డ కష్టాల్లో ఉంటే.. అమ్మ ఎంతటి సాహసమైనా చేస్తుంది. ప్రాణాలకు సైతం తెగిస్తుంది. తాజాగా బీహార్‌లో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శంగా నిలిచింది. సివాన్ లోనూ ఓ కుక్క ఇదే విషయాన్ని మరోసారి నిరూపించింది. ఇటీవల కురిసిన వర్షాలతో సివాన్ ప్రాంతంలోని కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నాయి. పొరపాటున అందులో తన బిడ్డ పడిపోయిందని గుర్తించి.. సాహసం చేసి మరీ కాపాడుకుంది తల్లి శునకం. మహదేవ నాయి బస్తీలో ఓ కాలువలో కుక్క పిల్ల పడిపోయింది. దారి తెలియక గజగజ వణికిపోయింది. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇది చూసిన తల్లి కుక్క వెంటనే నీళ్లలోకి దూకింది. మునిగిపోకుండా చాలా జాగ్రత్తగా కుక్క పిల్లను పంటికి కరుచుకుంది. చాలాసేపు ప్రయత్నించి ఎలాగోలా పట్టు దక్కించుకుంది. మెల్లగా నీళ్లలో నుంచి బయటకు వచ్చేంత వరకూ తన బిడ్డను అలా పళ్లతో గట్టిగా పట్టుకుంది తల్లి కుక్క. గట్టిగా ప్రయత్నించి చివరకు సురక్షితంగా బయటకు తీసుకురాగలిగింది. మిగతా పిల్లల వద్దకు చేర్చాలని ఆరాట పడింది. మధ్యలో అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ…తన పిల్లల వద్దకు కుక్కపిల్లని తీసుకెళ్లి వదిలింది.ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఫిల్మ్ తరువాతే సామ్‌కు ఈ వ్యాధి.. షాకింగ్ విషయం చెప్పిన కో స్టార్
Avatar 2: 100కోట్లకు అవతార్ 2 రైట్స్ !! దద్దరిల్లిపోయిన టాలీవుడ్ !!
స్టార్ హీరో సినిమా కోసం.. రామ్ చరణ్ ఐటెం సాంగ్..
విమానంలో అద్భుతమైన ఘట్టం.. 30 ఏళ్ల తర్వాత..
రిపేర్ చేసేలోపే పేలిన ఫోన్ !! చివరికి ఏమైందంటే ?? వీడియో వైరల్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

