భారీ వర్షాలు, వరదలతో బ్రిటన్ కూడా తల్లడిల్లుతోంది. అనేక నగరాల్లో మోకాలి లోతు నీరు ప్రవహిస్తోంది. స్కాట్లాండ్ దగ్గర్లోని గ్లాస్గో అయితే మరీ జల విలయంలో చిక్కుకుంది. ఈ నగరంలో అన్ని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కార్లు, ఇతర వాహనాలు నీటిలో సగం వరకు మునిగి..ముందుకు కదలడానికి మొరాయిస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో నీటిలో చిక్కుకుపోయి..ఆగిపోయిన తన కారు నుంచి కిందికి దిగిన ఓ మహిళ అతి కష్టం మీద దాన్నిముందుకు తోయడానికి శత విధాలా ప్రయత్నించింది. ఆమెకు సహాయం చేయడానికైనా దగ్గరలో ఎవరూ లేరు..ఆ సమయంలో ఆమె పెంపుడు కుక్కకి విషయం అర్థమైనట్టు ఉంది. పక్ అనే వింత పేరు గల ఈ శునకం తన యజమానురాలికి సాయం చేస్తున్నట్టుగా తన ముందు కాళ్లతో కారును తోస్తున్న అరుదైన దృశ్యం డేవిడ్ కీల్ అనే వ్యక్తి కంటబడింది. తన ఫ్లాట్ పై భాగాన ఉన్న ఆయన.. దీన్ని చూసి ఆఆశ్చర్యపోతూ ఈ సంఘటనను తన మొబైల్ లో వీడియో తీశాడు. కుక్క ఆమెకు సాయం చేస్తూ కారును ముందుకు తోయడం అసామాన్యమైన విషయం అంటున్నాడీయన.
చివరకు ఉడతా భక్తిగా కుక్క చేసిన ససాయమో ..ఏమో గానీ ఆ మహిళ.. నీరు అంతగా లేని రోడ్డు వద్దకు తన వాహనాన్ని చేర్చగలిగింది. లోరీ గెల్లిస్ అనే ఈ మహిళకు ఈ వీడియో డేవిడ్ నుంచి ఎలా అందిందో గానీ ఈ వీడియో క్లిప్ అందింది. సంతోషంతో ఉప్పొంగిపోయిన ఆమె.. తనకు డేవిడ్ అనే వ్యక్తి పంపిన క్లిప్ గా దీన్ని తెలుసుకుంది.ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ..అదే సమయంలో తన పెంపుడు జాగిలం తనకు తోడ్పడిన వైనంపై కూడా అదేపనిగా దాన్ని, సేవాగుణాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. పక్ అనే ఈ శునకం ప్రపంచంలోనే అత్యుత్తమైనదని పేర్కొంది. దానికి రివార్డుగా దాని ఇష్టమైన మాంసాహారాన్ని, గ్రేవీని ఇచ్చింది. తానూ, ఈ కుక్క అప్పుడపుడు షికారుకు బయటికి వెళ్తుంటామని, కానీ ఈ వరదల సమయంలో ఇది తనకిలా సాయపడుతుందని తాను కలలో కూడా అనుకోలేదని లోరీ గెల్లీ తెలిపింది.
Awwwww haha
Incredible moment dog helps Scots woman push car out of flood water in Glasgow ? pic.twitter.com/4o2cp74OZZ— Linzagain (@linzagain) August 11, 2021
మరిన్ని ఇక్కడ చూడండి : సీఎం సార్ మీ స్టెప్పులు సూపర్..వైరల్ అవుతున్న సీఎం డాన్స్ వీడియో..ఎక్కడంటే..?:CM Dance Video.