Dog-Cat Viral Video : మూడ్ ఆఫ్‌లో ఉన్నవారికి ఈ వీడియో మంచి రిలీఫ్.. కుక్క , పిల్లి కామెడీ..
పిల్లి, కుక్క వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగానే పిల్లు కనిపిస్తే.. కుక్క దాన్ని వేటాడుతుంది. అయితే, పెంపుడు జంతువులు అలా ఉండవు.
పిల్లి, కుక్క వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగానే పిల్లు కనిపిస్తే.. కుక్క దాన్ని వేటాడుతుంది. అయితే, పెంపుడు జంతువులు అలా ఉండవు. ఒకే ఇంట్లో పిల్లి, కుక్క రెండూ స్నేహంగా మెలగుతాయి. కొన్నిసార్లు అల్లరి చేస్తూ రచ్చ చేస్తుంటాయి. కొట్టుకుంటూ నానా హంగామా చేస్తాయి. ఈ దృశ్యాలు చూడటానికి చాలా ఫన్నీగా ఉంటాయి. తాజాగా అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో తనను పదే పదే డిస్ట్రబ్ చేస్తున్న కుక్కను లాగిపెట్టి కొట్టింది పిల్లి. ఆ దెబ్బకు బిత్తర పోయిన కుక్క.. పిచ్చి పట్టిన దానిలా అటూ ఇటూ తిరుగుతూ హంగామా చేసింది. కుక్క ప్రవర్తనను చూసి పిల్లి సైతం టెన్షన్ పడింది. కుక్కకు ఏమైందో అర్థం కాక.. దిక్కులు చూస్తుండిపోయింది. ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయి.. నెటిజన్లను తెగ నవ్విస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
