Dog-baby chicken: ఈ వీడియో చూస్తే మీ పొట్ట చెక్కలే.. నిజం..! అట్లుంటది మనతోని..

|

Jul 03, 2022 | 4:37 PM

సాధారణంగా ఇళ్లలో కుక్కలు, పిల్లులు, కోళ్లు, మేకలు ఇలా రకరకాల జంతువులు, పక్షులను పెంచుతుంటారు. ఇవన్నీ ఒకే చోట ఉండటంతో వాటి మధ్య జాతి భేదం లేకుండా స్నేహం పెంపొందుతుంది.


సాధారణంగా ఇళ్లలో కుక్కలు, పిల్లులు, కోళ్లు, మేకలు ఇలా రకరకాల జంతువులు, పక్షులను పెంచుతుంటారు. ఇవన్నీ ఒకే చోట ఉండటంతో వాటి మధ్య జాతి భేదం లేకుండా స్నేహం పెంపొందుతుంది. అంతేకాదు అప్పుడప్పుడు మన పిల్లల్లాగే అవికూడా తగవులాడుకుంటూ ఉంటాయి. వాటిమధ్య జరిగే ఈ అల్లరి భలే బావుంటుంది. ఇలాంటి వీడియోలు తరచూ నెట్టింట కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా తనతో ఆటలాడుతున్న ఓ చిన్ని కోడి పిల్లకు ఓ కుక్క అరక్షణంలో చుక్కలు చూపించింది. చావు భయం అంటే ఎంటో చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. ఒక కారులో వెనక కూర్చున్న కుక్క ముందు సీటు పై తలవాల్చి తన యాజమాని వైపు ఆసక్తిగా చూస్తుంది. అదే సమయంలో అక్కడే ఉన్న చిన్ని కోడి పిల్ల మెల్లగా కుక్క దగ్గరక వచ్చింది. దాని ముఖం వద్దకు వచ్చి దాన్ని ఫ్రెండ్లీగా ముక్కుతో పొడవబోయింది. వెంటనే ఆ కుక్క… నాతోనే ఆటలా.. అంటూ అమాంతం కోడిపిల్ల తలను నోట కరుచుకుంది. కాసేపటి వరకు కోడిపిల్ల తలను నోటిలో పట్టి బంధించింది. చచ్చానురో దేవుడో అంటూ.. నీకో దణ్ణం.. నన్ను ఒదిలెయ్‌ అన్నట్టు గిలగిలలాడింది. అలారా.. దారికి అన్నట్లు ఆ కుక్క కోడిపిల్లను విడిచిపెట్టింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు..తమదైనశైలిలో ఫన్నీకామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?