Wife with Lover: ప్రియునితో భార్య పరార్.. ఇద్దరు కూతుళ్లను చంపిన తండ్రి.. కట్ చేస్తే సీన్..

Wife with Lover: ప్రియునితో భార్య పరార్.. ఇద్దరు కూతుళ్లను చంపిన తండ్రి.. కట్ చేస్తే సీన్..

Anil kumar poka

|

Updated on: Jul 03, 2022 | 4:25 PM

కర్ణాటకలోని యశ్వంతపురలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య మరొకరితో వెళ్లిపోవడంతో భర్త ఉన్మాదిగా మారాడు. తన ఇద్దరు చిన్నారి కూతుళ్లను అత్యంత పాశవికంగా హతమార్చాడు.


కర్ణాటకలోని యశ్వంతపురలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య మరొకరితో వెళ్లిపోవడంతో భర్త ఉన్మాదిగా మారాడు. తన ఇద్దరు చిన్నారి కూతుళ్లను అత్యంత పాశవికంగా హతమార్చాడు. భోవినగరకు చెందిన లక్షీకాంత్, అంజలి దంపతులకు నలుగురు సంతానం. లక్ష్మికాంత్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అంజలి ఇటీవల వేరే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇదికాస్తా ముదిరి ప్రియునితో కలిసి వెళ్లిపోయింది. దీంతో లక్ష్మీకాంత్, అంజలిల నలుగురు పిల్లలను అవ్వ దగ్గర ఉంచాడు. ఈ క్రమంలోనే నలుగురు పిల్లలకు చిరుతిళ్లు కొనిస్తానని చెప్పి తండ్రి బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరిని ఆటోలో కూర్చోబెట్టి, మరో ఇద్దరు కూతుళ్లు..11ఏళ్ల సోని, పదేళ్ల మయూరిలను పక్కకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపాడు. ఇద్దరి మృతదేహాలను ఆటోలో పెట్టుకొని నేరుగా ఎంబీనగర పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం నగరంలో సంచలనం సృష్టించింది. లక్ష్మీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 03, 2022 04:24 PM