Loading video

బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?

|

Mar 28, 2025 | 10:19 AM

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఇటీవల తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌ సంచలనంగా మారింది. ఓబులాపురం మైనింగ్‌ కేసులో తన ఇంట్లో ఉన్న 53 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారని, ఆ నగలు తుప్పుపట్టిపోతాయని గాలి జనార్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ 53 కిలోల నగలతో పాటు రూ.5 కోట్ల విలువైన బాండ్లను తనకు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు సంగతి ఎలా ఉన్నా బంగారం తుప్పు పడుతుంది అనడం ఆసక్తికరంగా మారింది. నిజంగానే బంగారం తుప్పుపడుతుందా? ఎక్కువ కాలం నగలను వాడకుండా అట్టే పెడితే ఇనుము మాదిరిగాను బంగారం కూడా తుప్పు పట్టి చెడిపోతుందా? బంగారు ఆభరణాలను వాడకుండా దాచిపెడితే ఏమవుతాయి? ఇంతకీ తుప్పు అంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అనేక మందిని వేధిస్తున్నాయి. తు

ప్పు అంటే ఐరన్ ఆక్సైడ్. లోహశాస్త్రం ప్రకారం కేవలం ఇనుము, ఇనుము మిశ్రమంగా ఉన్న ఉక్కు వంటి వాటికి మాత్రమే తుప్పు పడుతుంది. తేమ, ఆక్సిజన్ వల్ల ఇనుములో రసాయన చర్య జరిగి ముదురు ఎర్ర రంగు పొర ఏర్పడుతుంది. దీనినే తుప్పు అంటుంటాం. ఇలాంటి పొర ఏర్పడిన తరువాత కూడా తగిన చర్యలు తీసుకోకపోతే లోహం క్రమంగా తన సహజ రూపం కోల్పోయి నశిస్తుందని రసాయన శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నట్‌లు, బోల్ట్‌లు, ఫ్యాన్లు, సైకిల్ చైన్‌లు, ఆటోమొబైల్ విడిభాగాల తయారీలో చాలావరకు ఇనుము మిశ్రమ లోహాలు వాడతారు. వీటికి పెయింటింగ్, ఆయిలింగ్, గ్రీసింగ్ ఇలా వివిధ చర్యల ద్వారా తుప్పు పట్టకుండా చూస్తారు. అయితే బంగారం అలా కాదు. బంగారాన్ని నోబుల్ ఎలిమెంట్‌ అంటారు. గోల్డ్‌ను తక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగించి ఆభరణాలు తయారుచేయవచ్చు.బంగారం సాధారణ ఆసిడ్‌లకు స్పందించదు. కేవలం నైట్రిక్ ఆసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ల మిశ్రమం అయిన ఆక్వా రెగియా అనే ఆమ్లంలో ఇది కరుగుతుంది. వెండి కూడా నోబుల్ ఎలిమెంటే. కాని గాలిలో ఉండే సల్ఫర్‌‌తో స్వల్పంగా చర్యకు గురవుతుంది. ఇత్తడి అనేది జింక్ – రాగి మిశ్రమం. దాదాపు ఖరీదైన ఆభరణాలు తయారు చేయటానికి వాడే లోహంలా కనిపిస్తుంది. అందుకే శిల్పకారులు విగ్రహాల తయారీలో ఎక్కువగా ఇత్తడిని వాడతారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏప్రిల్‌ 1 నుంచి UPI పేమెంట్స్‌ బంద్‌ వీడియో

ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే..వీడియో

పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!

పొదల్లో కనిపించిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు.. కొన్నాళ్లకు

Published on: Mar 28, 2025 10:18 AM