టార్చ్ లైట్ల వెలుగులోనే రోగులకు చికిత్స.. ఎక్కడో తెలుసా ??
మొబైల్ ఫోన్ టర్చ్ లైట్లు.. కేవలం చీకట్లో వెలుగులు నింపడానికి మాత్రమే కాదు.. అత్యవసర పరిస్థితిల్లో రోగులకు వైద్యం అందించడానికి కూడా ఉపయోగపడుతున్నాయి.
మొబైల్ ఫోన్ టర్చ్ లైట్లు.. కేవలం చీకట్లో వెలుగులు నింపడానికి మాత్రమే కాదు.. అత్యవసర పరిస్థితిల్లో రోగులకు వైద్యం అందించడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ బలియా జిల్లాలో భారీ వర్షం కారణంగా జిల్లా ఆసుపత్రికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు గంటల తరబడి చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. చేసేది లేక వైద్యులు చీకట్లో మొబైల్ ఫోన్లు టార్చ్ లైట్లు ఆన్ చేసుకుని రోగులకు చికిత్స అందించారు. చీకట్లోనే సర్జరీ చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీడియోలో స్ట్రెచర్‌పై ఒక మహిళ పేషెంట్ చుట్టూ వైద్యుల బృందం చికిత్స అందిస్తూ కనిపించారు. అయితే, జనరేటర్ కోసం బ్యాటరీలను సిద్దం చేస్తున్న సమయంలో.. ఆపరేషన్ జరుగుతుందని, దాంతో 15-20 నిమిషాలపాటు మాత్రమే విద్యుత్ ఆటంకం ఏర్పడిందని జిల్లా ఆసుపత్రి అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరటిపండ్లను చూస్తే ఎలుకలు పరుగో పరుగు !! ఎందుకో తెలుసా ??
నాగిని డ్యాన్స్ చేయమంటే నిజంగానే పాములా మారిపోయాడు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
కడుపునొప్పితో అస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేయగా వెలుగులోకి వచ్చిన స్టన్నింగ్ నిజం
వీల్‌ఛైర్‌లో ఫుడ్ డెలివరీ చేస్తోన్న యువతి !! హ్యాట్సాఫ్ అంటోన్న నెటిజన్లు