Heart Attack: గంటపాటు ఆగిపోయిన గుండె.. చివరికి 45 నిమిషాలు సీపీఆర్‌ చేసి కాపాడిన వైద్యులు.

Heart Attack: గంటపాటు ఆగిపోయిన గుండె.. చివరికి 45 నిమిషాలు సీపీఆర్‌ చేసి కాపాడిన వైద్యులు.

Anil kumar poka

|

Updated on: Oct 22, 2023 | 7:39 PM

మహమ్మారిలా మారిన గుండెపోటు మరో వ్యక్తిపై ఎటాక్‌ చేసింది. అయితే ఈసారి అతని ప్రాణాలు తీసుకోలేకపోయింది. గంటపాటు గుండె ఆగిపోయిన వ్యక్తికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు నాగ్‌పూర్‌ వైద్యులు. అనంతరం 45 రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. పూర్తిగా కోలుకున్న ఆ వ్యక్తిని అక్టోబరు 13న ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ చేశారు. పేషెంట్‌కు అత్యవసరంగా వైద్యం అందించాల్సి రావడంతో సీపీఆర్‌ వివరాలు నమోదుచేయలేకపోయామన్నారు వైద్యులు.

మహమ్మారిలా మారిన గుండెపోటు మరో వ్యక్తిపై ఎటాక్‌ చేసింది. అయితే ఈసారి అతని ప్రాణాలు తీసుకోలేకపోయింది. గంటపాటు గుండె ఆగిపోయిన వ్యక్తికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు నాగ్‌పూర్‌ వైద్యులు. అనంతరం 45 రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. పూర్తిగా కోలుకున్న ఆ వ్యక్తిని అక్టోబరు 13న ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ చేశారు. పేషెంట్‌కు అత్యవసరంగా వైద్యం అందించాల్సి రావడంతో సీపీఆర్‌ వివరాలు నమోదుచేయలేకపోయామన్నారు వైద్యులు. లేదంటే ఇదొక అరుదైన కేసుగా మిగిలిపోయేదని పేర్కొన్నారు వైద్యులు. వైద్యులు తెలిపి వివరాలు ప్రకారం.. నాగ్ పూర్ కు చెందిన ఐటీ ఉద్యోగి ఆగస్టు 25న అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. అప్పటికి మూడు నాలుగు రోజులుగా అనేకసార్లు కళ్లు తిరిగి పడిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గుండెపోటు కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ పేషెంట్ కు డాక్టర్ రిషి లోహియా నేతృత్వంలోని వైద్యుల బృందం సీపీఆర్ చేసింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచనల ప్రకారం.. 40 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా గుండె తిరిగి కొట్టుకోలేదంటే ఆ రోగి చనిపోయినట్లే.. అయితే, ఈ కేసులో 45 నిమిషాల పాటు సీపీఆర్ చేశామని, ఆ తర్వాత గుండె నెమ్మదిగా స్పందంచడం ప్రారంభించిందని డాక్టర్ లోహియా తెలిపారు. ఇలా సుదీర్ఘంగా సీపీఆర్ చేయడం, షాక్ లు ఇవ్వడం వల్ల పక్కటెముకలు విరగడం, షాక్ లకు చర్మం కాలిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారు. ఈ కేసులో అన్ని జాగ్రత్తలు తీసుకుని సీపీఆర్ చేయడంతో పేషెంట్‌కు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..