Kerala: బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి ఒక్కసారిగా పురిటి నొప్పులు.. వీడియో.

|

Jun 04, 2024 | 1:45 PM

కేరళలో మానవత్వం పరిమళించే ఘటన చోటుచేసుకుంది. అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించే ఉదంతం జరిగింది. కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ తోపాటు ఓ ఆసుపత్రి డాక్టర్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవ వేదనతో బాధపడుతున్న నిండు గర్భిణికి పునర్జన్మ ప్రసాదించారు. సకాలంలో స్పందించి తల్లీబిడ్డలను కాపాడారు. ఇందుకు సంబంధించి ఆసుపత్రి సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కేరళలో మానవత్వం పరిమళించే ఘటన చోటుచేసుకుంది. అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించే ఉదంతం జరిగింది. కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ తోపాటు ఓ ఆసుపత్రి డాక్టర్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవ వేదనతో బాధపడుతున్న నిండు గర్భిణికి పునర్జన్మ ప్రసాదించారు. సకాలంలో స్పందించి తల్లీబిడ్డలను కాపాడారు. ఇందుకు సంబంధించి ఆసుపత్రి సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కేరళలోని మలప్పురానికి చెందిన ఓ 37 ఏళ్ల మహిళ కేఎస్ ఆర్టీసీ బస్సులో త్రిస్సూర్ నుంచి కోజీకోడ్ లోని తొట్టిపాలేనికి బుధవారం మధ్యాహ్నం బయలుదేరింది. అయితే బస్సు పేరమంగళం అనే ప్రాంతానికి చేరుకోగానే ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని బస్సులోని ప్రయాణికులు డ్రైవర్ కు తెలియజేయడంతో అతను సమయస్ఫూర్తితో ఆలోచించి బస్సు రూటు మార్చాడు. సమీపంలో ఉన్న అమలా ఆసుపత్రికి ఎమర్జెన్సీ డెలివరీ గురించి ఫోన్లో తెలియజేసి బస్సును నేరుగా అక్కడికే పోనిచ్చాడు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on