Astronauts Wash Hair: వ్యోమగాముల జీవనశైలికి, సాధారణ ప్రజల జీవన విధానానికి పూర్తి తేడా ఉంటుంది. గురుత్వాకర్షణ లేని ప్రదేశంలో జీవించడం అంత సులభమైన విషయమేమి కాదు. స్పేస్ స్టేషన్‌లో నెలల పాటు నివసించే ఆస్ట్రోనాట్స్ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తినే ఆహారం నుంచి వ్యక్తిగత పరిశుభ్రత వరకు ప్రతీ ఒక్క అంశం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా కృత్రిమ వాతావరణంలో, ప్రకృతికి విరుద్ధంగా నివసించే వ్యోమగాములు అప్పుడప్పుడు తాము ఎదుర్కొనే కష్టాలకు సంబంధించిన వీడియోలను ప్రజలతో పంచుకుంటూంటారు. ఇటీవలే పిజ్జాను ఎలా తయారు చేసుకుంటారో తెలిపే ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా స్పేస్ స్టేషన్‌లో ఉంటోన్న మరో ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో తాము జుట్టును ఎలా శుభ్రం చేసుకుంటామన్న విషయాన్ని తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.
మేగాన్ మెక్‌ఆర్థర్ అనే ఆస్ట్రోనాట్ ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌లో పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు.. ‘వ్యోమ గాములు తమ జుట్టును ఎలా శుభ్రం చేసుకుంటారని.?’ ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సమాధానంగా తాను అంతరిక్షంలో తలను శుభ్రం చేసుకుంటున్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘వ్యోమగాములు అందరిలా నీటితో హెడ్ బాత్ చేయలేరు. దీనివల్ల నీరు ఎటు పడితే అటు వెళ్లి వస్తువులు పాడయ్యే ప్రమాదం ఉంటుంది’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇక ఈ వీడియో గమనిస్తే ఆస్ట్రోనాట్స్ జీవన విధానం ఇంత కష్టంగా ఉంటుందా అని అర్థమవుతోంది. ఒక ప్రత్యేకమైన షాంపూను ఉపయోగించి, తక్కువ నీటితో శుభ్రం చేసుకుంటారు. అలాగే నీరు బయటకు పోకుండా టవల్‌ను అడ్డుగా పెట్టుకొని కష్టపడుతోన్న తీరు నెటిజన్లు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
?Shower Hour! Astronauts can’t take showers in space or the water would go everywhere, so I thought I would demonstrate how we keep hair clean on the @Space_Station. The simple things we take for granted on Earth are not so simple in micro-gravity! pic.twitter.com/wfXhNv6zzD
— Megan McArthur (@Astro_Megan) August 31, 2021
Also Read: Nayanthara: కాబోయే భర్త నయన్‌ను ఏమని పిలుస్తాడో తెలుసా? అదే లేడీ సూపర్‌స్టార్ కొత్త సినిమా టైటిల్
Bheemla Nayak Song: నిమ్మళంగా కనపడే నిప్పుకొండ.. సెభాష్ భీమ్లా నాయకా… టైటిల్ సాంగ్ అదుర్స్..
Twin Elephants: ఆ దేశంలో 80 ఏళ్ల తర్వాత కవల ఏనుగులు జననం… తల్లితో సంతోషంగా ఆడుకుంటున్న గున్న ఏనుగులు