ప్రసవం కోసం వచ్చిన మహిళ.. కడుపులో ప్లేట్‌ పెట్టి కుట్టేసిన డాక్టర్లు !!

ప్రసవం కోసం వచ్చిన మహిళ.. కడుపులో ప్లేట్‌ పెట్టి కుట్టేసిన డాక్టర్లు !!

Phani CH

|

Updated on: Sep 08, 2023 | 9:54 AM

సాధారణంగా డాక్టర్లు ఆపరేషన్‌ చేసే సమయంలో దూది, కత్తెర వంటివి కడుపులో మరిచిపోయి కుట్లు వేయడం చూసాం. కానీ ఓ డాక్టర్‌ మాత్రం మతిమరుపులో గజినీని మించిపోయాడు. ఆపరేషన్‌ చేసి మహిళ కడుపులో ఏకంగా ప్లేటు సైజులో ఉన్న పరికరాన్ని మరచిపోయాడు. అదేంటి.. అని అనుకుంటున్నారా? అవునండీ.. ప్రసవం కోసం వెళ్లిన మహిళకు సిజేరియన్‌ చేసి బిడ్డను తీశాడు. ఆనక కుట్లు వేసే సమయంలో కడుపులో ఏకంగా ప్లేటు సైజు ఉన్న పరికరాన్ని పెట్టి కుట్లు వేసేశాడు.

సాధారణంగా డాక్టర్లు ఆపరేషన్‌ చేసే సమయంలో దూది, కత్తెర వంటివి కడుపులో మరిచిపోయి కుట్లు వేయడం చూసాం. కానీ ఓ డాక్టర్‌ మాత్రం మతిమరుపులో గజినీని మించిపోయాడు. ఆపరేషన్‌ చేసి మహిళ కడుపులో ఏకంగా ప్లేటు సైజులో ఉన్న పరికరాన్ని మరచిపోయాడు. అదేంటి.. అని అనుకుంటున్నారా? అవునండీ.. ప్రసవం కోసం వెళ్లిన మహిళకు సిజేరియన్‌ చేసి బిడ్డను తీశాడు. ఆనక కుట్లు వేసే సమయంలో కడుపులో ఏకంగా ప్లేటు సైజు ఉన్న పరికరాన్ని పెట్టి కుట్లు వేసేశాడు. ఈ విచిత్ర ఘటన న్యూజిలాండ్‌లో వెలుగు చూసింది. న్యూజిలాండ్ హెల్త్ కమీషనర్ ప్రకారం.. 2020 సంవత్సరం సెప్టెంబర్‌ 4న ఆక్లాండ్‌ సిటీ హాస్పిటల్‌కి ప్రసవ వేదనతో 20 యేళ్ల మహిళ వెళ్లింది. అక్కడి వైద్యులు సిజేరియన్‌ చేసి బిడ్డకు పురుడుపోశారు. తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. ఐతే ఆపరేషన్‌ చేసే సమయంలో 17 సెంటీమీటర్ల రిట్రాక్టర్ అనే పరికరాన్ని పెట్టి కుట్లు వేశారు. ఆ తర్వాత మహిళను డిశ్చార్జ్ చేసి పంపించేశారు. ఐతే ఆ తర్వాత మహిళ తరచూ కడుపునొప్పితో బాధపడుతుండేది. దీర్ఘకాలిక కడుపునొప్పితో బాధపడుతోన్న మహిళ వైద్యుల వద్దకు వెళ్లింది. వాళ్లు ఎక్స్‌రేతో సహా పలు పరీక్షలు చేశారు. ఎన్నో రకాల మందులు కూడా ఇచ్చారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి సీటీ స్కాన్‌లో అసలు విషయం బయటపడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి కావాలని పూజ‌లు.. విసుగెత్తి శివ‌లింగాన్నే ఎత్తుకెళ్లాడు

శాడిస్ట్‌ భర్త.. కట్నం కోసం భార్యను బావిలో వేలాడదీసాడు

Rajgir Glass Bridge: ఈ అద్భుత గాజు వంతెన విదేశాల్లో కాదు.. బీహార్‌లోనే..

మందుబాబుల రచ్చ.. ఐదో అంతస్తు బాల్కనీ స్లాబ్‌పై కూర్చుని

Digital TOP 9 NEWS: హిట్టుకొట్టిన జాతిరత్నం | జనసంద్రంగా జవాన్ థియేటర్స్‌