పెళ్లి కావాలని పూజలు.. విసుగెత్తి శివలింగాన్నే ఎత్తుకెళ్లాడు
ఓ యువకుడు తనకు పెళ్లి కావాలని ఎన్నో పూజలు చేశాడు. దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కానీ ఆ కోరిక ఫలించలేదు. దీంతో తనకు పెళ్లి కుమార్తె దొరకడం లేదనే కోపంతో ఏకంగా శివలింగాన్నే ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశంభి జిల్లాలో వెలుగు చూసింది. కౌశంభి జిల్లాకు చెందిన చోటూ అనే యువకుడు ప్రతి రోజు స్థానికంగా ఉన్న భైరవ బాబా టెంపుల్‌కు వెళ్లేవాడు. తనకు త్వరగా పెళ్లి కావాలని, మంచి అమ్మాయి దొరకాలని దేవుడిని చోటూ ప్రార్థించేవాడు.
ఓ యువకుడు తనకు పెళ్లి కావాలని ఎన్నో పూజలు చేశాడు. దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కానీ ఆ కోరిక ఫలించలేదు. దీంతో తనకు పెళ్లి కుమార్తె దొరకడం లేదనే కోపంతో ఏకంగా శివలింగాన్నే ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశంభి జిల్లాలో వెలుగు చూసింది. కౌశంభి జిల్లాకు చెందిన చోటూ అనే యువకుడు ప్రతి రోజు స్థానికంగా ఉన్న భైరవ బాబా టెంపుల్‌కు వెళ్లేవాడు. తనకు త్వరగా పెళ్లి కావాలని, మంచి అమ్మాయి దొరకాలని దేవుడిని చోటూ ప్రార్థించేవాడు. అలా కనీసం నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశాడు చోటూ. చివరకు అమ్మాయి దొరక్కపోవడంతో.. అసహనానికి గురైన చోటూ ఆగస్టు 31న శివలింగాన్ని అపహరించాడు. అయితే శివలింగం కనిపించకపోవడంతో మిగతా భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు.. భక్తులను విచారించారు. చోటూ అనుమానాస్పదంగా కనిపించడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించాడు. తాను ఎన్నో పూజలు చేసినప్పటికీ, అమ్మాయి దొరక్కపోవడంతోనే విసుగు చెంది శివలింగాన్ని అపహరించినట్లు తెలిపాడు చోటూ. ఆలయానికి సమీపంలో చెట్ల పొదల్లో దాచిపెట్టిన శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శాడిస్ట్ భర్త.. కట్నం కోసం భార్యను బావిలో వేలాడదీసాడు
Rajgir Glass Bridge: ఈ అద్భుత గాజు వంతెన విదేశాల్లో కాదు.. బీహార్‌లోనే..
మందుబాబుల రచ్చ.. ఐదో అంతస్తు బాల్కనీ స్లాబ్‌పై కూర్చుని
Digital TOP 9 NEWS: హిట్టుకొట్టిన జాతిరత్నం | జనసంద్రంగా జవాన్ థియేటర్స్
Jawan: జవాన్ ఎఫెక్ట్.. ఊగిపోతున్న థియేటర్స్
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

