Ayodhya: అయోధ్యలో 60 మంది మంగళ సూత్రాలు మాయం.! దొంగలకు అవకాశంగా మారాయా?

|

Feb 12, 2024 | 10:36 AM

అయోధ్యలో పర్యాటకుల రద్దీని అవకాశంగా తీసుకుంటూ దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళుతున్నారు. కరీంనగర్‌కు చెందిన కొందరు భక్తులు ఇటీవల రామ్‌ లల్లాను దర్శించుకునేందుకు అయోధ్యకు వెళ్లగా వారిలోని ఓ మహిళ వద్ద బంగారాన్ని దొంగలు చోరీ చేశారు. దీంతో, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకూ 60 మంది మహిళల మంగళ సూత్రాలు చోరీకి గురైనట్టు అక్కడి పోలీసులు చెబుతున్నారు.

అయోధ్యలో పర్యాటకుల రద్దీని అవకాశంగా తీసుకుంటూ దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళుతున్నారు. కరీంనగర్‌కు చెందిన కొందరు భక్తులు ఇటీవల రామ్‌ లల్లాను దర్శించుకునేందుకు అయోధ్యకు వెళ్లగా వారిలోని ఓ మహిళ వద్ద బంగారాన్ని దొంగలు చోరీ చేశారు. దీంతో, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకూ 60 మంది మహిళల మంగళ సూత్రాలు చోరీకి గురైనట్టు అక్కడి పోలీసులు చెబుతున్నారు. రామమందిర ప్రారంభోత్సవం తరువాత భద్రతా ఏర్పాట్లు కాస్తంత సడలించడంతో దొంగలు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడి పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా తొలగించడం దొంగలకు అవకాశంగా మారినట్టు తెలుస్తోంది. మరో వైపు అయోధ్య రైల్వేస్టేషన్​లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన వంటకాలను పర్యాటకులకు అందుబాటులో ఉంచనుంది ఐఆర్​టీసీ. అందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రాల వారీగా ఫుడ్ ప్లాజాలను ఏర్పాటు చేస్తోంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఏ రాష్ట్రానికి చెందిన పర్యటకులైనా తమ వంటకాలను ఆస్వాదించగలిగేలా చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..