బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళాడు.. పిల్లని పట్టి పెళ్లాడాడు.. చివరికి
ఓ యువతి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లింది. అక్కడ మరో దూరపు బంధువైన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, పెళ్లిపీటలెక్కి..చివరికి యువతి ప్రాణాలనే హరించింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాలు ప్రకారం.. న్యూఢిల్లీకి చెందిన ప్రీతి కూశ్వాహ అనే యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
రెండేళ్ల క్రితం సొంతూళ్లో జరిగిన శుభకార్యానికి హాజరైంది. ఆ వేడుకలో దూరపు బంధువు రింకూతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టి ఎప్పట్లాగే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరూ రహస్యంగా కలుసుకుంటూ, ఫోన్ లో మాట్లాడుకుంటూ రోజులు గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రీతిని రింకూ అనుమానించడం మొదలు పెట్టాడు. నువ్వు చాలా అందంగా ఉంటావు… నేను కాకుండా ఇతరులు ఎవరైనా నిన్ను ప్రేమిస్తే నేను ఏం చేయాలి అంటూ వేధించాడు. దీంతో తను ఎవరికీ అందంగా కనిపించకూడదనే ఆలోచనతో ప్రీతి తన అందమైన జట్టును సైతం వద్దనుకుని గుండు చేయించుకోవాలనుకుంది. దీనిపై కుటుంబ సభ్యులు వారించినా వినకుండా సెలూన్ కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. ప్రీతి సోదరుడే ఆమెకు గుండు చేశాడు. ఆ తర్వాత కూడా రింకూ తనతో మాట్లాడకపోవడం, తను ఫోన్ చేస్తే కట్ చేయడమే కాకుండా ఏకంగా ప్రీతి నెంబరే బ్లాక్ చేసేసాడు. దీంతో ప్రీతి తీవ్ర మనస్తాపానికి గురైంది. తనకు ఆత్మహత్యే శరణ్యమని భావించింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో తన గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం చిరుతకు ఎక్కడ దాక్కువాలో తెలియక.. ఏకంగా అక్కడ దాక్కుంది
లోను కట్టలేదని రంగంలోకి బ్యాంక్ మేనేజర్.. వచ్చి ఏకంగా దాన్నే ఎత్తుకుపోయారు
dilsukhnagar bomb blast: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
