Bomb in SpiceJet: ప్రేయసి కోసం స్పేస్ జెట్ విమానం ఆపేసిన అమర ప్రేమికుడిని ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్.

|

Jan 23, 2023 | 9:19 AM

స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌ ఇటీవల ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం సృష్టించింది. ఆ సమయంలో విమానంలో 182 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.


స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌ ఇటీవల ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం సృష్టించింది. ఆ సమయంలో విమానంలో 182 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఆ బెదిరింపు ఉత్తుత్తిదే అని అధికారులు తేల్చారు. ఆ తర్వాత దర్యాప్తు చేపట్టి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే నకిలీ కాల్‌ చేయడం వెనుక కారణం తెలిసి అధికారులు షాకయ్యారు. నిందితుడు తన స్నేహితుల ‘ప్రేమ’ కోసం విమానంలో బాంబు ఉందంటూ ఉత్తుత్తి బెదిరింపులు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ ట్రైనీ టికెటింగ్‌ ఏజెంట్‌ అభినవ్‌ ప్రకాశ్ ఈ ఫోన్‌ కాల్‌ చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతడిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రకాశ్ బాల్య స్నేహితులైన రాకేశ్‌, కునాల్‌కు ఇటీవల మనాలీ ట్రిప్‌లో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు యువతులతో పరిచయం ఏర్పడింది. గురువారం ఆ అమ్మాయిలిద్దరూ స్పైస్‌జెట్‌ విమానంలో పుణె వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాకేశ్, కునాల్‌.. ప్రకాశ్‌ను సాయం కోరారు. తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో మరింత సమయం గడిపేందుకు ఎలాగైనా విమానాన్ని ఆలస్యం చేయాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తాము ముగ్గురం కలిసి ఈ బాంబు నాటకం ఆడామని ప్రకాశ్ పోలీసు విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం ప్రకాశ్‌ స్నేహితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 23, 2023 09:19 AM