World’s Most Difficult Dance: ప్రపంచంలోనే అత్యంత కష్టమైన డ్యాన్స్..! సంప్రదాయమే కానీ చాల కష్టం.. వీడియో వైరల్.
ప్రపంచవ్యాప్తంగా వివిద దేశాలకు చెందిన ప్రజలు రకరకాల సంప్రదాయాలను పాటిస్తుంటారు. తమ ప్రాంత ప్రత్యేకతను చాటేలా కళారూపాలను ప్రదర్శిస్తుంటారు. అనాదిగా వస్తున్న ఆచారాలను కాపాడుతూ వుంటారు.
ప్రపంచవ్యాప్తంగా వివిద దేశాలకు చెందిన ప్రజలు రకరకాల సంప్రదాయాలను పాటిస్తుంటారు. తమ ప్రాంత ప్రత్యేకతను చాటేలా కళారూపాలను ప్రదర్శిస్తుంటారు. అనాదిగా వస్తున్న ఆచారాలను కాపాడుతూ వుంటారు. సంప్రదాయ, జానపద నృత్యాల నుంచి సమకాలీన శైలుల వరకు, వైవిధ్యమైన నృత్య రూపాలను ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని నృత్యరీతులు చూసేందుకు ఈజీగా అనిపించినా చేసేందుకు యత్నిస్తే ఎంత కష్టమో బోధపడుతుంది. అలా ఈ భూమ్మీద అత్యంత కష్టతరమైన డ్యాన్స్ గురించి చెప్పుకుంటే..ఈ భూమ్మీద అత్యంత కష్టతరమైన డ్యాన్స్.. జౌలి డ్యాన్స్.. అవును.. ఈ నృత్యానికి ప్రపంచంలోనే అత్యంత కష్టమైన డ్యాన్స్‌గా ముద్రపడింది. పశ్చిమ ఆఫ్రికా దేశం సెంట్రల్ ఐవరీ కోస్ట్ నుంచి వచ్చిన ఈ జౌలి నృత్య రూపకం ప్రపంచంలోనే అత్యంత కష్ట సాధ్యమైన నృత్యంగా గుర్తింపు పొందింది. గురో సంప్రదాయంలో జౌలి డాన్స్ ఒక భాగం. జౌలి నృత్యం.. మెరుపు కదలికల విన్యాసాలకు కేరాఫ్. అథ్లెటిక్ తరహా మూమెంట్స్ ఉంటాయి ఇందులో. ఆ నృత్యం బాగా రావాలంటే.. ప్రదర్శకులు తీవ్రమైన శిక్షణ పొందాలి. కఠోరమైన సాధన తీసుకోవాలి. డ్రమ్స్, ఇతర వాయిద్యాల భారీ శబ్ధాల నడుమ ఏమాత్రం శ్రుతి తప్పినా కిందపడిపోవడం ఖాయం. అలాంటి జౌలి నృత్యానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..