Snake Viral Video: తిరుపతిలో వింత పాము.. 10 రోజులుగా ఒకేచోట పాము తిష్ట.. ఎక్కడ వదిలినా మళ్లీ ప్రత్యక్షం!
తిరుపతిలో ఓ వింత పాము ప్రత్యక్షమైంది. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట లోని పెద్ద చెరువు సమీపంలో ఓ నాగుపాము కనిపించింది. ఆ పామును ఎక్కడకు తీసుకువెళ్లి వదిలిపెట్టినా..
తిరుపతిలో ఓ వింత పాము ప్రత్యక్షమైంది. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట లోని పెద్ద చెరువు సమీపంలో ఓ నాగుపాము కనిపించింది. ఆ పామును ఎక్కడకు తీసుకువెళ్లి వదిలిపెట్టినా… మళ్లీ అక్కడకే వచ్చి కనపడుతోంది. ఈ పామును గుర్తించిన స్థానికులు అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇది దైవ స్వరూపమే అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. పది రోజుల క్రితం నాలుగు అడుగుల నాగుపామును పెద్ద చెరువు కట్ట పై రోడ్డు పక్కన కనిపించింది. ఆ పాము వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ… ఎన్ని రోజులు అయినా…ఆ పాము వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. పాము అక్కడ్నించి వెళ్ళడం లేదని తీసుకెళ్ళి దూరంగా వదిలిపెట్టి వచ్చారు. అయినా ఆ పాము తిరిగి అదే ప్లేసుకు వచ్చి అక్కడే వుండిపోతోంది. దీంతో ఆ పామును దైవంగా భావించి.. పూజలు చేయడం మొదలుపెట్టారు స్థానికులు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎవరు ఆ పామును పట్టుకున్నా అది కాటు వేయడం లేదు. దాంతో స్థానికులు మరింతగా ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

