లీవ్‌ కావాలని ఎండీకి మెసేస్‌ పెట్టిన ఎంప్లాయ్‌.. మరు క్షణంలోనే

Updated on: Sep 16, 2025 | 7:07 PM

కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం.. ఈ మరణం ఎప్పుడు ఎవరిని ఎలా స్పృశిస్తుందో తెలియదు. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ అందరితో సంతోషంగా గడిపిన వ్యక్తులు క్షణాల్లో కుప్పకూలి కనుమరుగైపోతున్నారు. తాజాగా అలాంటి హృదయ విదారక ఘటన మరోటి ఢిల్లీలో చోటుచేసుకుంది. సెలవు కావాలంటూ తన యజమానికి మెసేజ్‌ పెట్టిన 10 నిమిషాలకే ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయాడు ఓ ఉద్యోగి.

ఈ విషయం తెలిసిన ఆ యజమాని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటన అందరినీ కలచివేసింది. శంకర్ అనే ఓ 40 ఏళ్ల ఉద్యోగి తన పైఅధికారి కేవీ అయ్యర్‌కు సెలవు కావాలని కోరుతూ ఉదయం 8:37 గంటలకు ఒక మెసేజ్ పంపారు. సార్, తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాను. ఈరోజు ఆఫీస్‌కు రాలేను. దయచేసి సెలవు మంజూరు చేయండి అంటూ ఆ మెసేజ్‌లో కోరారు. ఉద్యోగులనుంచి ప్రతిరోజూ ఇలాంటివి మామూలే అని భావించిన ఆ యజమాని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత 10 నిమిషాలకే అంటే 8:47 గంటలకు శంకర్ గుండెపోటుతో మృతి చెందారు. 11 గంటల సమయంలో అయ్యర్‌కు ఈ విషయం తెలిసింది. తన సహోద్యోగి ఇక లేరని తెలిసి ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయం తనతో మాట్లాడిన వ్యక్తి కొద్దిసేపటికే మరణించాడన్న వార్తను ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయాన్ని అయ్యర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ధూమపానం, మద్యపానం వంటి ఎలాంటి చెడు అలవాట్లు లేని శంకర్ ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం నమ్మలేకపోతున్నాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం అసాధ్యం” అంటూ పోస్ట్‌ చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన నెటిజన్లను కంటతడి పెట్టించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చంద్రుడి పైకి మీ బోర్డింగ్‌ పాస్‌! అవకాశం మిస్ కాకండి

బాబోయ్.. రోడ్డుపై భారీ పైథాన్… ఆ తర్వాత జరిగిందిదే

భోపాల్‌ ‘90 డిగ్రీల’ వంతెనకు పోటీగా నాగ్‌పూర్‌ ‘బాల్కనీ ఫ్లైఓవర్‌’

క్షుద్ర పూజలకు విరుగుడు ఉందా? ఆ మంత్రానికి అంత శక్తి ఉందా?

30 పైసలకు పడిపోయిన కిలో ఉల్లి ధర.. రైతు ఆత్మహత్య