అక్కడ భక్తుల కోర్కేలు తీర్చకపోతే దేవతలకు శిక్షలు.. ఎందుకంటే ??

|

Sep 02, 2022 | 8:45 AM

ఛత్తీస్‌గఢ్‌లో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ముఖ్యంగా దేవుడి వ్యవస్థలు ఇప్పటికీ అక్కడ కొనసాగుతున్నాయి. ఇక్కడ దేవతలు కూడా తప్పు చేసినందుకు శిక్ష అనుభవిస్తారు.

ఛత్తీస్‌గఢ్‌లో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ముఖ్యంగా దేవుడి వ్యవస్థలు ఇప్పటికీ అక్కడ కొనసాగుతున్నాయి. ఇక్కడ దేవతలు కూడా తప్పు చేసినందుకు శిక్ష అనుభవిస్తారు. ఈ శిక్షలను న్యాయమూర్తులు అని పిలువబడే దేవతల అధిపతులు విధిస్తారు. ప్రతి సంవత్సరం ధామ్తరి జిల్లాలోని కుర్సిఘాట్ బోరాయ్‌లో గిరిజన దేవతల న్యాయమూర్తి భంగారావ్ మాయి ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపులో ఇరవై కోస్ బస్తర్, ఏడు పాలీలతో సహా పదహారు పరగణాల దేవతలు ఉంటారు. ఒరిస్సా నుంచి కూడా ఈ ఉరేగింపును చూసేందుకు భారీగా జనం వస్తారు. కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విశిష్ట ఆచారాన్ని , న్యాయస్థానాన్ని చూసేందుకు వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకుంటారు. కుర్సి ఘాట్‌లో శతాబ్దాల నాటి భంగారావ్ మాయి ఆస్థానం ఉంది. దీనిని దేవతల కోర్టుగా పిలుస్తారు. భంగారావు గుర్తింపు లేకుండా ఏ దేవత కూడా ఈ ప్రాంతంలో పని చేయదని నమ్మకం. అదే సమయంలో ఈ ప్రత్యేక కోర్టు స్థలంలోకి మహిళలకు ప్రవేశం నిషేధం. ఇక దేవతలకు శిక్షలు ఎందుకు విధిస్తారు అంటే.. తాము పూజించే దేవుళ్ళు, దేవతలు గ్రామంలో సంభవించిన ఇబ్బందులు, సమస్యలను తొలగించలేని సందర్భంలో.. తమ విధిని నిర్వర్తించలేదని ప్రజలు నమ్ముతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేగంగా వస్తున్న లోకల్ ట్రైన్.. పట్టాలపై మహిళ పరుగులు.. ఆ తర్వాతే అసలైన ట్విస్ట్ !!

Viral: వామ్మో !! రెండు మొసళ్ల మధ్య ఫైట్‌ ఎప్పుడైనా చూశారా ??

Nikhil: పవన్ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ హీరోను నిలబెడుతోంది

Pawan Kalyan: దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్‌ మేనియా..

పేరుకు స్టార్ హీరోయిన్.. కాని అప్పనంగా 2 కోట్లు నొక్కేసింది !!

 

Published on: Sep 02, 2022 08:45 AM