తనను కాపాడిన వ్యక్తికి జింక కృతజ్ఞతలు.. ఏం చేసిందో చూడండి !!

|

Apr 03, 2023 | 8:55 PM

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఉన్న ఆనందం, సంతృప్తి ఇంకెందులోనూ ఉండకపోవచ్చు. తాజాగా ఆపదలో చిక్కుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ మూగజీవిని కాపాడి తన మంచిమనసును చాటుకున్నాడు.

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఉన్న ఆనందం, సంతృప్తి ఇంకెందులోనూ ఉండకపోవచ్చు. తాజాగా ఆపదలో చిక్కుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ మూగజీవిని కాపాడి తన మంచిమనసును చాటుకున్నాడు. ఆ మూగజీవి కూడా అతని పట్ల తన కృతజ్ఞతను చాటుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ జింక ఫెన్సింగ్ దాటేందుకు ప్రయత్నించి.. వైర్ మధ్యలో చిక్కుకుపోయింది. దాంతో అవతలికి దూకలేక, వెనక్కి రాలేక ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. సాయం కోసం బిక్కు బిక్కుమంటూ చూస్తోంది. ఇంతలో దానిని గమనించిన ఓ వ్యక్తి.. జింకను జాగ్రత్తగా ఫెన్సింగ్ అవతలివైపుకు దాటించాడు. జింక సంతోషంతో చెంగు చెంగున అక్కడినుంచి వెళ్లిపోయింది. అయితే అలా వెళ్లిన జింక ఎవరూ ఊహించని విధంగా తన పరివారాన్నంతా వెంటపెట్టుకొని తనను కాపాడిన వ్యక్తి ఇంటివచ్చి తన కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎంజాయ్‌ చేయడానికి ఏజ్‌తో పనేముంది !! ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు

ఆఫ్రికాలో పుట్టింది.. కోనసీమలో కనువిందు చేస్తోంది !!

Published on: Apr 03, 2023 08:55 PM