బుడిపెలున్న చేపను చూసారా
ఎన్నో జీవజాతులకు సముద్రాలు ఆవాసాలు. చాలావరకు జలచరాలు సముద్రంలో పరిమిత లోతు వరకే జీవిస్తాయి. కానీ, సముద్ర గర్భంలో ఏకంగా 10 వేల అడుగులకు పైగా లోతులో తిరుగుతున్న 3 రకాల చేపలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. పసిఫిక్ సముద్రంలో వేల అడుగుల లోతున ఇవి సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఒంటిపై పింక్ రంగు బుడిపెలు ఉన్న స్నెయిల్ ఫిష్ కెమెరాకు చిక్కింది.
ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోని ఓ అగాధంలోని వీటిని సముద్ర రోబోల ద్వారా చిత్రీకరించిన వీడియోల ద్వారా వీటిని కనుగొన్నారు. చేపలు సముద్రంలో ఎంత లోతువరకు వెళ్తాయో ఇది చూపిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘బయోవన్’ జర్నల్‌లో ప్రచురించిన పత్రంలో ఈ చేపల పేర్లను తెలిపారు. గుండ్రటి తల గలిగిన ఈ పింక్ చేపకు కేర్‌ప్రొక్టస్ కొలికలి అని, నల్లని రౌండ్ తల ఉన్న చేపకు కేర్‌ప్రొక్టస్ యాన్సెయి అని, పొడవుగా ఉన్న చేపకు పారాలిపారిస్ ఎమ్ అని పేర్లు పెట్టారు. ఇందులో బంపీ స్నెయిల్ ఫిష్ సముద్ర ఉపరితలం నుంచి 10 వేల అడుగుల లోతున ఉంటుంది. మిగిలిన రెండు చేపలు 13 వేల అడుగుల లోతున ఉంటాయి. ప్రపంచంలో అత్యంత లోతైన ప్రదేశాల్లో చేపల మనుగడపై అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలకు ఇవి చిక్కాయి. ‘ఇజు- ఒగాసవారా’ అగాధంలో స్నెయిల్ ఫిష్‌ను గుర్తించారు. ఇవి పిల్ల చేపలని.. తక్కువ లోతులో నివసించే పెద్ద జీవుల బారినుంచి తమను తాము కాపాడుకునేందుకు వీలైనంత లోతుకు వెళ్తాయని మాంటరే బే అక్వేరియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇంకా న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ బయాలజిస్ట్‌లు అంటున్నారు. గతంలో 2008లో 7,703 మీటర్ల లోతులో మాత్రమే చేపలను గుర్తించారు. మరోవైపు.. ఇప్పటివరకు అత్యంత లోతులో చిక్కిన చేపలు ఇవే. లోతైన జలాల్లో అక్కడి తీవ్ర పరిస్థితులను తట్టుకుని ఎలా జీవిస్తున్నాయో అధ్యయనం చేసేందుకు ఇవి సహాయపడతాయని అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్యాంక్‌లో ఇరుక్కున్న ఏనుగు.. ఎలా కాపాడారో చూడండి
ఎలుగుబంటికి కూల్ డ్రింక్ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏమైందంటే
బెడ్‌పై పడుకుందామని దుప్పటి తీసిన వ్యక్తి… దెబ్బకు పరుగో పరుగు