Viral Video: ఘోరమైన యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న బాలుడు.. వీడియోతో పోలీసుల అవగాహన

|

Jul 14, 2021 | 6:52 PM

ట్రాఫిక్ రూల్స్ పాటించపోతే మనకు జరిమానాలు పడతాయని తెలుసు.. అలాగే రహదారులపై నడిచేప్పుడు, ప్రయాణించేప్పుడు రహదారి భద్రతా నియామాలు పాటించకపోతే కూడా ఘోరమైన ప్రమాదాలు ఎదుర్కొవాల్సి వస్తుంది.

Viral Video: ఘోరమైన యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న బాలుడు.. వీడియోతో పోలీసుల అవగాహన
Cyberabad Traffic Police Awerness On Traffice Rules
Follow us on

Viral Video: ట్రాఫిక్ రూల్స్ పాటించపోతే మనకు జరిమానాలు పడతాయని తెలుసు.. అలాగే రహదారులపై నడిచేప్పుడు, ప్రయాణించేప్పుడు రహదారి భద్రతా నియామాలు పాటించకపోతే కూడా ఘోరమైన ప్రమాదాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే ఈ విషయంలో పోలీసులు పలు రకాల చర్యలు చేపట్టారు. ప్రముఖులతో వీడియోలు చేయించి అవగాహన కూడా కల్పించారు. అయినా కొంతమంది మాత్రం వాటిని పెడ చెవిన పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఓ వీడియోను సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ట్రాఫిక్ రూల్స్ పాటించడం మన బాధ్యత. చిన్న పిల్లలకు వాటి గురించి తెలుసుకునే హక్కు ఉంది. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాలి’ అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియోను ఉద్దేశిస్తూ రాసుకొచ్చారు.

ఈ వీడియోలో ఏముందంటే.. తమిళనాడు రాష్ట్రంలోని గుడియాతాం అనే ప్రాంతంలో ఓ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో ఓ బాలుడు గబగబా నడుచుకుంటూ వచ్చి కొద్దిసేపు రొడ్డు పక్కన ఆగుతాడు. అటూఇటూ చూసి కంగారుగా రోడు దాటబోతుంటాడు. ఇంతలో ఎదురుగా వచ్చిన ఓ లారీ కింద పడతాడు. అయితే, ఆ పిల్లాడికి చాలా అదృష్టం ఉండడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. దీంతో చుట్టుపక్క వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే వీడియోను సైబరాబాద్ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తోంది. నిజమే కదా.. మనం అజాగ్రత్తగా ఉన్నా.. లేదా అవతలి వాళ్లు పొరపాటువల్ల ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి. అందులో పిల్లలకు మరీ ముఖ్యంగా రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ రూల్స్ చెప్పకపోవడంతో ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాలని సైబరాబాద్ పోలీసులు కోరుకుంటున్నారు.

Also Read:

Viral Video: పర్యాటక బస్సును చుట్టుముట్టిన పులులు…!! నెట్టింట వీడియో వైరల్..!!

Fish Biscuits: కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఫిష్‌ బిస్కెట్లు .! ( వీడియో )