ఆ దేశంలో సడెన్‌గా కరెంట్ కోత.. అసలు ఏం జరుగుతుందంటే?

Updated on: Jan 13, 2026 | 10:33 AM

యూరప్‌లోని అతిపెద్ద నగరం ఆధునికతకు మారుపేరైన జర్మనీ రాజధాని బెర్లిన్‌లో గత 80 ఏళ్లలో పవర్‌ కట్‌ కానే లేదు. అలాంటిది ఆ నగరం ఇప్పుడు అంధకారాన్ని చూసింది. చీకట్లో గడ్డ కట్టే చలితో వేల మంది బెర్లిన్‌ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వాళ్లకు సదుపాయాలు కల్పించలేక అటు ప్రభుత్వం నానాపాట్లు పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. తొలిసారి బెర్లిన్‌ నగరాన్ని ఆ స్థాయిలో చీకట్లు అలుముకున్నాయి.

హైవోల్టేజ్‌ కేబుల్స్‌ కాలిపోవడంతో 50 వేల ఇళ్లకు, 1500ల వ్యాపార సముదాయ భవనాలకు కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. గడ్డ కట్టే చలిని తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం అయితే -9 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్‌ నమోదు అయ్యింది. వెంటనే ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. యుద్ధ ప్రాతిపాదికన హోటల్స్‌, స్కూల్స్‌, స్పోర్ట్స్‌సెంటర్‌లకు నగర పౌరులను తరలించింది. చివరకు బస్సులనూ షెల్టర్‌లుగా ఉపయోగించింది. అందరికీ ఆహారం, పడక, ఇతర సౌకర్యాలు కల్పించింది. పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో.. 24 గంటలు హాట్‌ వాటర్‌ సదుపాయం కల్పించారు. ఇందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించింది కూడా. రెండ్రోజులకు తాత్కాలికంగా.. గురువారం నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్‌ను పునరుద్ధరించగలిగారు. నగరానికి విద్యుత్‌ సరఫరా చేసే లైన్లలో జరిగిన అగ్నిప్రమాదం తమ పనేనని వుల్కన్‌గ్రూప్ అనే నిషేధిత సంస్థ ప్రకటించింది. దీంతో ఉగ్ర దాడి కోణంలోనే ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..

బ్రష్​ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి

నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం