Currency Ganapati: ఆకట్టుకుంటున్న నోట్ల గణపతి.. ఏకంగా 3 కోట్ల రూపాయలతో అలంకరణ..

|

Sep 20, 2023 | 3:27 PM

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ రూపాలలో గణేషుడు పూజలందుకుంటున్నాడు. ఈ క్రమంలో విభిన్నమైన కాన్సెప్ట్‌లతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఒక విగ్రహానికి మరో విగ్రహం భిన్నంగా ఉంటున్నాయి. బెంగళూరునగరంలో గణపతి మందిరాన్ని భారత కరెన్సీ నోట్లు, నాణేలతో అలంకరించారు. పది నుంచి 500 రూపాయల నోట్లు, ఇంకా 10 రూపాయల నాణేలతో..

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ రూపాలలో గణేషుడు పూజలందుకుంటున్నాడు. ఈ క్రమంలో విభిన్నమైన కాన్సెప్ట్‌లతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఒక విగ్రహానికి మరో విగ్రహం భిన్నంగా ఉంటున్నాయి. బెంగళూరునగరంలో గణపతి మందిరాన్ని భారత కరెన్సీ నోట్లు, నాణేలతో అలంకరించారు. పది నుంచి 500 రూపాయల నోట్లు, ఇంకా 10 రూపాయల నాణేలతో గణేష మండపాన్ని వినూత్నంగా అలంకరించారు. పుట్టేనహళ్లిలోని సత్యసాయి గణపతి ఆలయంలో సత్య గణపతి షిరాడీ సాయిబాబా ట్రస్టు నిర్వహకులు సుమారు మూడు కోట్ల రూపాయలను మండపం అలంకరణకు వినియోగించారు. కరెన్సీ నోట్లను మాలలుగా తీర్చి దిద్ది మండపాన్ని అలంకరించారు. ఈ వైభవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. 120 మందికి పైగా ఉన్న బృందం గుడిలో కరెన్సీ నోట్లను అలంకరించేందుకు 15 రోజులు కష్టపడ్డారని నిర్వహకులు పేర్కొన్నారు. మరోవైపు చంద్రయాన్-3 విజయంతో మన ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ప్రయత్నించారు. జై కర్ణాటక, జై జవాన్ జై కిసాన్, మేరా భారత్ మహాన్ థీమ్‌లతో నాణేలతో చక్కగా అలంకరించారు. వినాయకుడి గుడిని అలంకరించడానికి ఈ సొమ్ము అంతా భక్తులు ఇచ్చారని, ట్రస్టు జమ చేసిన సొమ్ము కూడా ఉపయోగించామని ట్రస్టీ రామ్మోహన్ రాజ్ తెలిపారు. గుడిలో కరెన్సీ నోట్ల భద్రత కోసం 15 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బందిని, 20కి పైగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సోమవారం వేకువ జామున 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..