24 Eyes Fish: ఒక ఇంచు కూడా లేని చేపకు 24 కళ్లు..! శాస్త్రవేత్తల కంటపడ్డ విచిత్ర చేప..
చేపలలో అనేక రకాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. వాటిలో కొన్ని వింత చేపలు కూడా ఉన్నాయి. ఈ కోవలోకి వచ్చే మరో చేప ఇటీవల శాస్త్రవేత్తల కంట పడింది. హాంకాంగ్ బాప్టిస్ట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జెల్లీ ఫిష్ జాతికి చెందిన విచిత్రమైన చేపను కనుగొన్నారు.
చేపలలో అనేక రకాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. వాటిలో కొన్ని వింత చేపలు కూడా ఉన్నాయి. ఈ కోవలోకి వచ్చే మరో చేప ఇటీవల శాస్త్రవేత్తల కంట పడింది. హాంకాంగ్ బాప్టిస్ట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జెల్లీ ఫిష్ జాతికి చెందిన విచిత్రమైన చేపను కనుగొన్నారు. దాని ఆకృతి శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచింది. ఓషన్ పార్క్ హాంకాంగ్, యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్, WWF-హాంకాంగ్‌తో కలిసిన బృందం ఈ చేపపై మరింతగా పరిశోధనలు సాగిస్తోంది. ఈ చేప జెల్లీ ఫిష్ కుటుంబానికి చెందినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని పరిమాణం ఒక అంగుళం కన్నా తక్కువగానే ఉంది. ఈ చేప శరీరంలో మొత్తం 3 టెంటకిల్స్, 24 కళ్లు ఉన్నాయి. ఈ కళ్లు 6, 4 సమూహాలుగా ఉన్నాయి. ప్రతి సమూహంలో 2 కళ్లలో మాత్రమే లెన్స్‌లు ఉన్నాయి. మిగిలిన కళ్లు మాత్రం కాంతిని గ్రహిస్తాయి. ఇది ఒక ప్రత్యేక తరహా చేప. ఈ రకమైన బాక్స్ జెల్లీ ఫిష్ ఫ్లోరిడా, సింగపూర్, జమైకా, భారతదేశం, ఆస్ట్రేలియాలలో కూడా కనిపిస్తుందని ప్రొఫెసర్ క్యూ తెలిపారు. ప్రపంచంలో మొత్తం 49 జల్లీ ఫిష్ జాతులు ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!