దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు

Updated on: Jan 10, 2026 | 4:03 PM

బీహార్‌లో దొంగను అరెస్ట్‌ చేయబోయి, పోలీసులు కోట్ల విలువైన ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు సస్పెండ్ అయ్యారు. మరోవైపు, రాజస్థాన్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లో ఇరుక్కుపోయిన దొంగ, తమిళనాడులో మద్యం మత్తులో నిద్రపోయిన దొంగ.. ఇలా విచిత్ర రీతిలో పట్టుబడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దొంగతనాల కథల్లో ఊహించని మలుపులు.

దొంగను అరెస్ట్‌ చేయడానికి వెళ్లిన పోలీసులు ఏకంగా ఆ దొంగ ఇంట్లోనే కోట్ల రూపాయల విలువచేసే ఆభరణాలు చోరీ చేసారు. ఈ ఘటన బీహార్‌లోని వైశాలిలో జరిగింది. రామ్‌ప్రీత్‌ , ఆయన భార్య ఒక దొంగల ముఠాను నడుపుతున్నారన్న ఆరోపణపై లాల్‌గంజ్‌ పోలీసులు వారి ఇంటిపై దాడి చేసి పెద్దయెత్తున బంగారం, వెండి, నగలు స్వాధీనం చేసుకుని సాహ్నీ భార్యను అరెస్ట్‌ చేశారు. అయితే వాటిని వారు కొట్టేసి, కేవలం పాత పాత్రలు, ఒక టీవీ, కొన్ని తుక్కు సామాన్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు రికార్డుల్లో చూపారు. వారు ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న రెండు కిలోల బంగారం, ఆరు కిలోల వెండి, ఇతర విలువైన వస్తువుల గురించి రికార్డుల్లో చూపలేదు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ స్టేషన్‌ ఇన్‌చార్జిని, మరో ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేస్తూ పై అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దొంగతనానికి వచ్చిన దొంగలు అనుకోకుండా పట్టుబడిపోతున్న ఘటనలు తాజాగా రెండు జరిగాయి. రాజస్థాన్ కోటాలోని బోర్ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో ఎవరూ లేరని, ఎగ్జాస్ట్​ ఫ్యాన్​ రంధ్రం గుండా ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేయాలనుకున్నాడో ఓ దొంగ. కానీ అతడి ప్లాన్​ అట్టర్​ ఫ్లాఫ్​ అవుతుందని ఊహించలేకపోయాడు. ఇంట్లోకి ఎగ్జాస్ట్​ ఫ్యాన్​ రంధ్రం గుండా లోనికి ప్రవేశించే క్రమంలో అందులోనే చిక్కుకుపోయాడు. తీరా ఇంటి యజమాని వచ్చి చూసే సరికి ఆ దొంగ కాళ్లు ఇంటి లోపల, తల బయట ఉండిపోయింది. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తమిళనాడులో మరో దొంగ దొంగతనం చేసేందుకు మందు తాగి వెళ్లాడు. తర్వాత తాళం పగలగొట్టడంలో విఫలమయ్యాడు. దాంతో అక్కడే మద్యం మత్తులో నిద్ర పోయాడు. ఉదయం యజమాని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి అరెస్ట్​ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trump: గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేసిన ట్రంప్

Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు ట్రైలర్.. పక్కా పండగ బొమ్మ

విజయ్, ప్రభాస్ కూడా ఆ భామ తర్వాతే.. ఒక చిత్రం తో సంచలనం

Megastar Chiranjeevi: మరోసారి దర్శకులకు క్లాస్ తీసుకున్న మెగాస్టార్

Toxic: టాక్సిక్ టీజర్ రివ్యూ.. కంచె తెంచేసిన యశ్