Viral Video: ఆకలితో వచ్చిన పందికి పాలిచ్చిన ఆవు.. నెట్టింట వీడియో వైరల్
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు చోటు చేసుకున్నా వెంటనే అందరికి తెలుస్తున్నాయి. వాటిల్లో కొన్ని మనిషి ఆలోచింపజేసేవిగా ఉంటే మరికొన్ని సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి.
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు చోటు చేసుకున్నా వెంటనే అందరికి తెలుస్తున్నాయి. వాటిల్లో కొన్ని మనిషి ఆలోచింపజేసేవిగా ఉంటే మరికొన్ని సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఇక తాజాగా ఓ ఆవు పంది పిల్లలు కడుపారా పాలు ఇస్తున్న వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రకాశంజిల్లా మార్కాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో ఆవు పాలను పంది తాగింది. రోడ్డుపక్కన ఆవులు సంచరిస్తుండగా అటుగా వచ్చిన ఓ పంది ఆవు పొదుగును చూసి పాలను తాగింది. సాధారణంగా ఇతర జంతువులకు పాలు ఇచ్చేందుకు ఆవులు అంత సుముఖంగా ఉండవు. అయితే బిడ్డ ఆకలి తల్లికి తెలుసు అన్నట్టుగా ఆ ఆవు తన మాతృత్వాన్ని చాటుకుంది. పాలను తాగేందుకు వచ్చిన పందిని చూసి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తన పాలను పందికి పట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Havana Syndrome: హవానా సిండ్రోమ్ భారత్‌కు చేరిందా..?? వీడియో
Viral Video: గుర్రంపై ఎక్కిన మేకలు స్వారీ.. సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో