నడిరోడ్డుపై అంతా చూస్తుండగా రొమాన్స్.. జంట కోసం పోలీసుల వేట

Phani CH

Phani CH |

Updated on: Jan 26, 2023 | 8:40 PM

రాను రాను సమాజంలో విచ్చలవిడితనం పెరిగిపోతోంది. ఎవరేమనుకుంటే నాకేంటి అన్న చందంగా బిహేవ్‌ చేస్తున్నారు యూత్‌. బహిరంగంగానే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.

రాను రాను సమాజంలో విచ్చలవిడితనం పెరిగిపోతోంది. ఎవరేమనుకుంటే నాకేంటి అన్న చందంగా బిహేవ్‌ చేస్తున్నారు యూత్‌. బహిరంగంగానే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వైజాగ్‌లో ఓ యువకుడు బైక్‌పైన అమ్మాయిని తన ఒడిలో అభ్యంతరకరంగా కూర్చోబెట్టుకొని రైడ్‌ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తాజాగా అలాంటి జంఘటనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ యువ జంట బహిరంగంగా శృంగార చేష్టలకు దిగింది. అది కూడా నడి రోడ్డుపైనే. ప్రియుడు స్కూటర్ నడుపుతుంటే, అతడిని కౌగిలించుకుని ఒళ్లో కూర్చున్న ప్రియురాలు అతనికి ముద్దులు పెడుతోంది. వెనుక వస్తున్న వాహనదారులలో ఒకరు ఈ తతంగం మొత్తం వీడియో తీయడమే కాకుండా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. దీంతో లక్నో పోలీసులు ఈ జంటను పట్టుకునే పనిలో పడ్డారు. లక్నోలోని హజరత్ గంజ్ ప్రాంతంలో ఈ వీడియో తీసినట్టు పోలీసులు గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మడతపెట్టే ఫోన్‌లే కాదు ఇళ్లు కూడా వచ్చేశాయ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

అతి తక్కువ ధరకే అమ్మకానికి ఐలాండ్‌.. ఎక్కడో తెలుసా ??

జనక్‌పూర్ రైలు టిక్కెట్ కొనేందుకు EMI సౌకర్యం !! వివరాలు ఇవే

బాయ్‌ఫ్రెండ్‌ మొహం చూడకూడదని గోడ కట్టించింది..

గుండు కొట్టించుకున్న క్యాన్సర్ పేషెంట్.. సెలూన్ బాయ్ ఏం చేశాడంటే ??

 

Follow us

Click on your DTH Provider to Add TV9 Telugu