మడతపెట్టే ఫోన్‌లే కాదు ఇళ్లు కూడా వచ్చేశాయ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Phani CH

Phani CH |

Updated on: Jan 26, 2023 | 8:28 PM

పెళ్లి చేసి చూడు..ఇల్లు కట్టి చూడు..’ అని ఓ సామెత. మనిషి జీవితంలో పెళ్లికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇంటికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందనేది ఈ సామెత అర్థం.

పెళ్లి చేసి చూడు..ఇల్లు కట్టి చూడు..’ అని ఓ సామెత. మనిషి జీవితంలో పెళ్లికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇంటికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందనేది ఈ సామెత అర్థం. అందుకే పెళ్లి విషయంలోనూ, ఇంటి నిర్మాణం విషయంలోనూ అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉంటే ఇటీవల ఇంటి నిర్మాణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణ బిల్డింగ్‌ల నుంచి డూప్లెక్స్‌ల వరకు ఇళ్ల నిర్మాణంలో మార్పులు వచ్చాయి, వస్తున్నాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మడతపెట్టే ఇళ్లు కూడా వచ్చేశాయ్‌. ఈ ఇంటిని ఎంచక్కా మడతపెట్టేసి నచ్చిన చోటుకి తీసుకెళ్లిపోవచ్చు. మడత పెట్టే ఇళ్లు అంటే అదేదో సాధారణంగా ఉంటుందనుకోకండి.. ఇంటి లోపల లగ్జరీగా ఉంటుంది. తాజాగా ఈ ఫోల్డబుల్‌ ఇంటికి సంబంధించిన వీడియోను ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేశారు. దీంతో ఈ అంశం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ఫోల్డబుల్ హౌస్‌గా పిలిచే ఈ ఇంటిని 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టూడియో అపార్ట్ మెంట్ మాదిరిగా నిర్మించారు. ఈ ఇంటి నిర్మాణానికి 49,500 డాలర్లు ఖర్చు అవుతుంది. మన కరెన్సీలో చెప్పాలంటే 40 లక్షలు ఖర్చవుతుంది. ఈ ఇంటిలో ఓపెన్‌ కిచెన్‌, బెడ్‌ రూమ్‌, హాల్‌ ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతి తక్కువ ధరకే అమ్మకానికి ఐలాండ్‌.. ఎక్కడో తెలుసా ??

జనక్‌పూర్ రైలు టిక్కెట్ కొనేందుకు EMI సౌకర్యం !! వివరాలు ఇవే

బాయ్‌ఫ్రెండ్‌ మొహం చూడకూడదని గోడ కట్టించింది..

గుండు కొట్టించుకున్న క్యాన్సర్ పేషెంట్.. సెలూన్ బాయ్ ఏం చేశాడంటే ??

Kim Jong un: రోజంతా తాగుతూ.. ఏడుస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. అసలు ఏమైందంటే ??

Follow us

Click on your DTH Provider to Add TV9 Telugu