Funny Wedding: కాస్ట్‌లీ వెడ్డింగ్ ఫొటోషూట్ బెడిసికొట్టింది.. నెటిజన్లకు నవ్వుల విందే..! వైరల్ అవుతున్న వీడియో
జీవితంలో ఒక్కసారి జరిగే వివాహ వేడుకను ఎంతో గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటారు చాలామంది. అందుకోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటుంటారు. ఇక ప్రస్తుతం వివాహ వేడుకల్లో ఫొటోషూట్లకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
జీవితంలో ఒక్కసారి జరిగే వివాహ వేడుకను ఎంతో గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటారు చాలామంది. అందుకోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటుంటారు. ఇక ప్రస్తుతం వివాహ వేడుకల్లో ఫొటోషూట్లకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే ముందే అందమైన ప్రదేశాలు, లొకేషన్లకు వెళ్లి వెరైటీ థీమ్‌లతో వినూత్నంగా ఫొటోలు, వీడియోలు తీయించుకుంటున్నారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ వెడ్డింగ్ ఫొటోషూట్ వీడియా నెట్టింట్లో వైరల్‌గా మారింది.ప్రీవెడ్డింగ్ షూట్‌లో భాగంగా పెళ్లి దుస్తుల్లో ముస్తాబైన వధూవరులు ఓ అందమైన లొకేషన్‌లో నిల్చొని ఉన్నారు… వీరితో పాటు ఫొటోగ్రాఫర్ కూడా ఉన్నాడు.. వధూవరులు రొమాంటిక్ పోజులో ఉండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. వెనక నుంచి ఓ విమానం పొగలు కక్కుతూ వారివైపు దూసుకొచ్చింది…వారి తలమీదుగా వేగంగా వెళ్లిపోయింది…అయ్యోపాపం అని కంగారు పడకండి..ఎందుకంటే..ఇదంతా కూడానూ ఫొటోషూట్‌లో భాగమేనట.ఈ దృశ్యాన్ని ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో అందంగా బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ ఇది కాస్ట్‌లీ వెడ్డింగ్ ఫొటోషూట్ గురూ..అంటూ నెటిజన్లు అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..