UP Police: యూపీ పోలీసుల నిర్వాకం.. ఏం చేశారో తెలిస్తే షాకవుతారు..! వీడియో వైరల్

|

Oct 01, 2023 | 9:17 AM

సినీమా ఫక్కీలో ఓ యువకుడిపై నేరం మోపాలని చూసినట్టు తెలుస్తోంది. సాధారణంగా సినిమాల్లో ఎవరినైనా నేరం నుంచి తప్పించడానికి మరో వ్యక్తిపై ఏదోరకంగా నేరం మోపి అరెస్ట్‌ చేయడం చూస్తుంటాం. కానీ యూపీ పోలీసులు అది నిజంగానే చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అశోక్‌ త్యాగి, రాఖీ దంపతులు కుమారుడు అంకిత్‌ను ఓ భూ వివాదం కేసులో నిందితుడుగా పోలీసులు అరెస్ట్‌ చేశారు .

సినీమా ఫక్కీలో ఓ యువకుడిపై నేరం మోపాలని చూసినట్టు తెలుస్తోంది. సాధారణంగా సినిమాల్లో ఎవరినైనా నేరం నుంచి తప్పించడానికి మరో వ్యక్తిపై ఏదోరకంగా నేరం మోపి అరెస్ట్‌ చేయడం చూస్తుంటాం. కానీ యూపీ పోలీసులు అది నిజంగానే చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అశోక్‌ త్యాగి, రాఖీ దంపతులు కుమారుడు అంకిత్‌ను ఓ భూ వివాదం కేసులో నిందితుడుగా పోలీసులు అరెస్ట్‌ చేశారు . అయితే, ఇది అక్రమమని, తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ అంకిత్‌ తల్లిదండ్రులు సీసీటీవీలో రికార్డైన ఓ వీడియో ఫుటేజీని షేర్ చేశారు. కొందరు పోలీసులు త్యాగి ఇంటికి రావడం, వారిలో కొందరు పోలీసులు ఇంటి బయట పార్క్ చేసిన త్యాగి కుమారుడు అంకిత్ మోటార్ బైక్‌లో ఓ తుపాకి పెట్టడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత తనిఖీ చేస్తున్నట్టు నటిస్తూ ఆ తుపాకిని స్వాధీనం చేసుకుని అంకిత్‌ను అరెస్ట్ చేశారు. భూ వివాదంతో సంబంధం ఉన్న తమ ప్రత్యర్థులతో చేతులు కలిపి పోలీసులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని రాఖీ ఆరోపించారు. ఇప్పుడీ సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన మీరట్ ఎస్పీ దెహాత్ కమలేశ్ బహదూర్.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, దీని వెనక ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్టు గుర్తించామని, వారిని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..