Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్ కూడా.! మటన్ కోసం ఎగబడిన జనం
ఇద్దరు వ్యాపారస్తుల మధ్య పోటీ మటన్ ప్రియులకు లాభం చేకూర్చింది. కేజీ 800 రూపాయలు పలుకుతున్న మటన్, కేవలం 497 రూపాయలకే దొరుకుతుండటంతో మాంసాహార ప్రియులు దుకాణానికి క్యూ కట్టారు. దీంతో మరో మాంసం వ్యాపారి కూడా అమాంతం రేటు తగ్గించి కేజీ 498 రూపాయలకే విక్రయించడంతో రెండు దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడాయి. అంతేకాదు, మాంసం తక్కువధరకు విక్రయించడంతో పాటు కొన్నవారికి ఓ ఫ్రీ గిఫ్ట్ కూడా ఇచ్చారు.
ఇద్దరు వ్యాపారస్తుల మధ్య పోటీ మటన్ ప్రియులకు లాభం చేకూర్చింది. కేజీ 800 రూపాయలు పలుకుతున్న మటన్, కేవలం 497 రూపాయలకే దొరుకుతుండటంతో మాంసాహార ప్రియులు దుకాణానికి క్యూ కట్టారు. దీంతో మరో మాంసం వ్యాపారి కూడా అమాంతం రేటు తగ్గించి కేజీ 498 రూపాయలకే విక్రయించడంతో రెండు దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడాయి. అంతేకాదు, మాంసం తక్కువధరకు విక్రయించడంతో పాటు కొన్నవారికి ఓ ఫ్రీ గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఒకరు కేజీ మటన్ కు రెండు చాక్లెట్లు ఉచితంగా ఇస్తే, మరొకరు కేజీ మటన్ కు మసాలా ప్యాకెట్ ఫ్రీగా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మటన్ ప్రియులు చుట్టుపక్కల ఊర్లవారు ఆ రెండు మటన్ షాపుల వద్దకు ఎగబడి వెళ్లారు. ఈ ఇద్దరు వ్యాపారస్తుల మధ్య మాటకు మాట పెరిగి పోటీ రావడంతో పందానికి పోయి ఇద్దరు మాంసం విక్రయదారులు అతి తక్కువ ధరకు మటన్ విక్రయించారు. ఇక 498 రూపాయలకు అమ్మిన మటన్ షాపు యజమాని కిలో మటన్ తీసుకున్న వారికి రెండు చాక్లెట్లను ఉచితంగా ఇవ్వగా, మరోవ్యక్తి దీనికన్నా ఒక రూపాయి తక్కువకే అమ్ముతానని 497 రూపాయలకే కేజీ మాంసాన్ని వినియోగదారులకు అమ్ముతూ కేజీ మటన్ కొన్నవారికి మటన్ మసాలా ప్యాకెట్ను ఫ్రీగా ఇచ్చాడు. దీంతో చుట్టుపక్కల ఊర్లవారు కూడా అక్కడికి చేరుకొని మటన్ కొనుగోలు చేశారు. దీంతో సాయంత్రం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఇద్దరి వద్ద మటన్ అయిపోయింది. ఇద్దరు వ్యాపారుల మధ్య బేధాభిప్రాయాలు మటన్ ప్రియులకు కలిసి వచ్చాయి. రూ.500 లోపు ధరకే మటన్ రావడంతో దీనిని హాయిగా కొనుక్కున్న మటన్ ప్రియులు సంబరపడ్డారు. దొరకని వారు అయ్యో అప్పుడే మటన్ అయిపోయిందా అని మదనపడ్డారు. దీన్ని బట్టి ఆలోచిస్తే కోపతాపాలకు పోయి నష్టపోవడం తప్ప లాభపడేది ఉండదని.. ఆలోచనతో వ్యాపారం చేస్తేనే మంచిదన్నది మరోసారి రుజువైందంటున్నారు స్థానికులు. ఈ ఘటన కడప జిల్లాలోని మైదుకూరు లో జరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.