50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!

|

Jan 13, 2023 | 9:46 AM

త్వరలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఇది దాదాపు 50 వేల ఏళ్ల క్రితం కనిపించిన అరుదైన దృశ్యం. తోకచుక్కలు గురించి మనకు తెలుసు.

త్వరలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఇది దాదాపు 50 వేల ఏళ్ల క్రితం కనిపించిన అరుదైన దృశ్యం. తోకచుక్కలు గురించి మనకు తెలుసు. తోకచుక్కలు నిజంగా చుక్కలు కావు. తోకచుక్కలు సౌరకుటుంబానికి చెందినవి. సంస్కృతంలో తోకచుక్కలను ధూమకేతువులంటారు. పూర్వకాలంలో తోకచుక్క కనిపిస్తే ఏదో అరిష్టానికి సూచనగా భావించేవారు. ఇప్పటికి ఇంచుమించు 600 తోకచుక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో 513 చాలా దీర్ఘకాలికమైనవి. పూర్వం ఆకాశంలోతోకచుక్క కనిపిస్తే ఏదో అరిష్టం జరగబోతుందని భావించేవారు. ఇదిలా ఉంటే త్వరలో ఎప్పుడో 50 వేల ఏళ్ల క్రితం కన్పించిన ఓ తోకచుక్క త్వరలో మళ్లీ మనల్ని పలకరించనుంది. ఫిబ్రవరి 1న భూమికి అత్యంత సమీపంగా, అంటే 2.6 కోట్ల మైళ్ల దూరం నుంచి పయనించనుంది. జనవరి 26 నుంచి వారంరోజులపాటు కన్పిస్తుందని నాసా చెబుతోంది. అది ప్రస్తుతం మనకు 11.7 కోట్ల మైళ్ల దూరంలో ఉందని వెళ్లడించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!

మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??

వామ్మో బాహుబలి సిస్టరా ఏంది !! భారీ క్రేన్‌ను తేలికగా ఎత్తేసిన మహిళ !!

Veera Simha Reddy: బాలయ్య పాటకు.. గుడి పూజారీ క్రేజీ డ్యాన్సు !!

‘వారిసు’ థియేటర్లో ఏడ్చిన తమన్ !! ఎందుకంటే ??

 

Published on: Jan 13, 2023 09:46 AM