Viral Video: వామ్మో అలా ఎలా..?సముద్రంలో గల్లంతు.. కానీ 24 రోజులు బతికాడు..

Updated on: Mar 15, 2023 | 8:44 PM

కొలంబియాలో 24 రోజులు సముద్రంలో చిక్కుకుపోయిన ఓ నావికుడు ఆహారం లేక కెచప్‌ తింటూ ప్రాణాలు కాపాడుకున్నాడు. డొమినికా వాసి ఎల్విస్‌ ఫ్రాంకోయిస్‌కు ఎదురైన భయానక అనుభవం ఇది.

కొలంబియాలో 24 రోజులు సముద్రంలో చిక్కుకుపోయిన ఓ నావికుడు ఆహారం లేక కెచప్‌ తింటూ ప్రాణాలు కాపాడుకున్నాడు. డొమినికా వాసి ఎల్విస్‌ ఫ్రాంకోయిస్‌కు ఎదురైన భయానక అనుభవం ఇది. 2022 డిసెంబరులో అతడు పడవలో కరేబియన్‌ సముద్ర ద్వీపం సెయింట్‌ మార్టిన్‌ వద్ద ఉన్న సమయంలో అకస్మాత్తుగా భారీ పెనుగాలులు వీచాయి. వాటి ధాటికి పడవ ఒడ్డు నుంచి సముద్రంలోకి కొట్టుకుపోయింది. పడవలో ఒక కెచప్‌ సీసా, వెల్లుల్లి పౌడర్‌, కొంచెం మ్యాగీ మాత్రమే ఉన్నాయి. నడిసంద్రంలో తనను ఎవరైనా రక్షించకపోతారా అన్న ఆశతో ఫ్రాంకోయిస్‌ ప్రాణాలు అరచేత పట్టుకొని ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఆకలి వేస్తే కెచప్‌ను కొద్ది కొద్దిగా తింటూ కాలం గడిపాడు. అలా 24 రోజులు గడిచిపోయాయి. జనవరి 15న ఓ హెలికాప్టర్‌ తన పడవపై ఎగురుతూ వెళ్లడం ఫ్రాంకోయిస్‌ గమనించాడు. వెంటనే పడవలోని చిన్నపాటి అద్దం బయటకు తీశాడు. దానిపై సూర్యరశ్మి పడి ఆ వెలుతురు హెలికాప్టర్‌లో ఉన్నవారికి తాకేలా కదిపాడు. పైన ఎగురుతోంది కొలంబియా నేవీ హెలికాప్టర్‌. అందులోని వారు ఫ్రాంకోయిస్‌ను గమనించి రక్షించారు. సరైన తిండి, నీరు లేకపోవడంతో ఫ్రాంకోయిస్‌ బాగా బలహీనపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స తరువాత పూర్తిగా కోలుకున్న ఫ్రాంకోయిస్‌ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 15, 2023 08:44 PM