Coins Scooty: బైక్ కొనడం కోసం 15 ఏళ్లుగా నాణేల సేకరణ.. కలను నెరవేర్చుకున్న యువకుడు..

|

May 07, 2022 | 8:28 PM

బైక్ మీద ప్రయాణం అంటే యువతకు క్రేజ్. కొంతమందికి ద్విచక్రవాహనం కొనుగోలుచేయాలనేది కల.. ఆ కలను నెరవేర్చుకోవడానికి రూపాయి రూపాయి కూడబెడతారు.


బైక్ మీద ప్రయాణం అంటే యువతకు క్రేజ్. కొంతమందికి ద్విచక్రవాహనం కొనుగోలుచేయాలనేది కల.. ఆ కలను నెరవేర్చుకోవడానికి రూపాయి రూపాయి కూడబెడతారు. ఒడిశా మయూర్‌భంజ్‌ జిల్లా బారిపదాకు చెందిన వికాస్‌ 15 ఏళ్ల క్రితం సొంతంగా బైక్ కొనాలనుకున్నాడు. అప్పటి నుంచి రూపాయి, రెండు రూపాయల క్యాయిన్స్ పోగుచేయడం మొదలెట్టాడు. తనకు ఎంత వీలయితే అంత చిల్లర పోగుచేస్తూ ఉన్నాడు.62 వేలు పోగయ్యాక ఈ మొత్తాన్ని సమీపంలోని షోరూంలోకి వెళ్లి ఇచ్చాడు. అయితే ఈ చిల్లర నాణేలను లెక్కించడానికి షో రూమ్ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. డబ్బు ఏ రూపంలో ఉన్నా డబ్బే కదా అంటూ స్కూటర్ ను వికాస్ కు అప్పగించారు. ఎలాగైతేనేమి.. తన ఆసక్తిని ఇష్టాన్ని 15 ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్న వికాస్ ఇప్పుడు కొత్త స్కూటీమీద చక్కర్లు కొడుతున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Published on: May 07, 2022 08:28 PM